newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మన అడవులు అగ్నికి ఆహుతవుతుంటే పట్టించుకోమా..?

03-04-202103-04-2021 16:13:23 IST
Updated On 03-04-2021 11:07:35 ISTUpdated On 03-04-20212021-04-03T10:43:23.002Z03-04-2021 2021-04-03T04:55:35.963Z - 2021-04-03T05:37:35.321Z - 03-04-2021

మన అడవులు అగ్నికి ఆహుతవుతుంటే పట్టించుకోమా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇతర దేశాల్లో అడవులు అగ్నికి ఆహుతవుతూ ఉంటే పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంటారు. అదే మన దేశంలో అడవులు అగ్నికి ఆహుతవుతూ ఉంటే మాత్రం కనీసం పట్టించుకోము..! ప్రస్తుతం శేషాచలం అడవులు అగ్నికి ఆహుతవుతూ ఉన్నాయి. కానీ వాటి గురించి స్పందించే వాళ్లే లేకుండా పోయారని అంటున్నారు. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రగిలితే పెద్ద రచ్చ చేసిన యువత.. మన శేషాచలం అడవులు మాడి మసవుతుంటే ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు.  

శేషాచలం అడవుల్లో రెండు రోజుల క్రితం మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ఆ మంటలు శరవేగంగా వ్యాపిస్తూ వందలాది ఎకరాలను తగులబెడుతున్నాయి. గురువారం మంగళం అటవీ ప్రాంతంలోని అవ్వారికోనలో ప్రారంభమైన మంటలు కరకంబాడి వైపునకు దాదాపు 5 కిలోమీటర్ల మేర విస్తరించాయి. తిరుపతి వైపునకు కూడా వ్యాపించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మంటలు కాలనీ వైపునకు రాకుండా అదుపు చేసిన టీటీడీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు రోజులుగా వందల ఎకరాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి.. పచ్చని అడవిని మసి చేస్తున్నాయి. అవ్వాచారి కోనలో మొదలై శేషాచలం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఈ మంటల దెబ్బకు చెట్లు, వన్య ప్రాణులు కాలిపోతున్నాయి. గురువారం మంగళం అటవీ ప్రాంతం నుంచి ప్రారంభమైన మంటలు కరకంబాడి దిశగా 5 కిలోమీటర్లు విస్తరించాయి. శుక్రవారం తిరుపతివైపునకు వ్యాపించాయి. 

తిరుమల నగరం వైపు ఉన్న తిరుమలనగర్‌, తుడా క్వార్టర్స్‌, జయశంకర్‌ కాలనీల వరకు విస్తరించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ, టీటీడీ సిబ్బంది మంటలు కాలనీల వైపునకు రాకుండా అదుపు చేసి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అడవిలో ఎండిన ఆకులు, దట్టమైన గడ్డి ఉండడంతో పాటూ గాలి తోడు కావడంతో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు అవ్వాచారి కోన దాటి అవతలి వైపునకు వెళ్తే, తిరుమల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని దహించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.  కార్చిచ్చు కారణంగా అరుదైన వృక్షాలు కాలి బూడిద కాగా, వన్యప్రాణులు కూడా పెద్ద ఎత్తున మరణించి ఉంటాయని భావిస్తున్నారు. 

అటవీశాఖ అధికారులు గ్రీన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, తితిదే అటవీ సిబ్బంది దాదాపు 40 మంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాత్రంతా మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం ఇదే అటవీప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు సకాలంలో అప్రమత్తమై అదుపు చేశారు. ఈసారి మాత్రం విపరీతమైన వేడి, తీవ్రమైన ఎండల కారణంగా మంటలను అదుపుచేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle