newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం

16-01-202216-01-2022 08:49:28 IST
2022-01-16T03:19:28.437Z16-01-2022 2022-01-16T03:19:23.941Z - - 25-05-2022

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సీనియర్ హీరో, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న మంచు మోహన్ బాబు. విలన్‌ పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్‌ అయ్యారు. ఇలా వెండితెరపై రాణిస్తున్నానే.. మరోవైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్‌ బాబు మరో కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. 

‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle