newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ‌సూళ్లందు.. స్కూలు ఫీజుల వ‌సూలు వేరు

07-04-202107-04-2021 15:03:41 IST
2021-04-07T09:33:41.353Z07-04-2021 2021-04-07T05:14:25.583Z - - 11-04-2021

వ‌సూళ్లందు.. స్కూలు ఫీజుల వ‌సూలు వేరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

స‌రే.. మీ పిల్ల‌లు స్కూలుకి రావ‌డం లేదు. టీచ‌ర్లు ఎక్కువ మంది ఆన్ లైన్ క్లాసులు చెప్ప‌డం లేదు. ఒప్పుకుంటాం. ఒక‌రోజు క్లాస్ ఉంటే ఒక రోజు ఉండ‌డం లేదు. టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ వ‌స్తున్న‌య్. వంద మాట‌లు చెప్పండి.  కాద‌న‌డం లేదు. నిజ‌మే.. ప్రాక్టిక‌ల్ గా స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఉన్న‌య్. కానీ.. స్కూల్ ఫీజు క‌ట్టాల్సిందే. బ‌స్ ఫీజులు క‌ట్టాల్సింది. స్టేష‌న‌రీ ఫీజులు క‌ట్టాల్సిందే.. యూనిఫామ్ ఫీజులు కూడా క‌ట్టాల్సిందే. 

ఏందేందీ.. స్టేష‌న‌రీ ఫీజులు క‌ట్టాల్నా.. మా పాప‌కి మేమే క‌దా బుక్స్ కొనుక్కొచ్చాం అంటే న‌డ‌వ‌దు. స్కూలుకి వ‌స్తే మేం ఇవ్వం అన్నామా..  అక్క‌డ రెడీగా ఉన్న‌య్. వెళ్లి తీసుకోండి. మా ద‌గ్గ‌ర తీసుకోకున్నా స‌రే.. స్టేష‌న‌రీ ఫీజులు క‌ట్టాల్సిందే అనేది స్కూల్స్ యాజ‌మాన్యం డిమాండ్. ఇక పోతే.. బ‌స్ ఫీజు కూడా అడుగుతున్నార‌ట‌. అదేంటీ.. మా పాప మా గేట్ కూడా దాట‌ట‌డం లేదు క‌దా.. బ‌స్ ఫీజు ఎందుకు క‌ట్టాలి అంటే.. మ‌రి మేం మీ పిల్ల‌ల కోస‌మే క‌దా.. బ‌స్ లు తెచ్చుకున్నాం. కొన్ని కిరాయికి కూడా తెచ్చినం. వాళ్ల‌తో ఏళ్ల‌కేళ్ల కాంట్రాక్ట్ ఉంది. మ‌రి మేం క‌ట్టాలి క‌దా వాళ్ల‌కి. అంటే.. మేమెక్క‌డి నుంచి తెచ్చేం చెప్పండి.. మా స్కూళ్లో ఉన్న ప్రింటింగ్ మెషీన్ లో.. డ‌బ్బులు ప్రింట్ చేయ‌లేం క‌దా అనేది స్కూల్స్ వాద‌న‌.

ఇక పోతే.. స్కూల్ ఫీజు కూడా యాజ్ టీజ్ గా క‌ట్టాల్సిందే. ఏటాలాగే.. ఇప్పుడు కూడా పెంచుతున్నం. పెంచిన ఫీజు క‌ట్టాల్సిందే అంటున్నార‌ట‌. అదేంటండీ.. అస‌లే క‌రోనా.. స్కూల్ కే రావ‌డం లేదు. టీచ‌ర్ల శాల‌రీస్ మంద‌మే క‌దా.. మీ ఖ‌ర్చు.. మ‌ళ్లీ పెంచితే  ఎలా.. అయినా అంద‌రు టీచ‌ర్లు రావ‌డం లేదు..  మిగ‌తా స్కూల్ సిబ్బందితో ప‌నే లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఎందుకు పెంచుతున్నారు అని పిల్ల‌ల పేరెంట్స్ వాద‌న‌. కానీ.. స్కూల్ బిల్డింగ్ ని అద్దెకు తీసుకున్నం క‌దా అంటున్నార‌ట‌. అందుకే పెంచుతున్నం అని క్లారిటీ ఇస్తున్నార‌ట‌. మేన్టెనెన్స్ ఉంటుంది క‌దా.. అందుకే ఫీజు పెంచుతున్నం అని చెబుతున్నార‌ట‌. ఇక ఓన్ బిల్డింగ్ క‌దా మీది.. ఎందుకు పెంచుతున్నారు అంటే. ఓన్ బిల్డింగ్ అయినా.. మేం అద్దెకు ఇవ్వ‌కుండా మ‌న స్కూల్ కోస‌మే ఉంచుతున్నం క‌దా.. అందుకే ఆ అద్దె కింద ఫీజు మొత్తం ఇవ్వాల్సిందే. అలాగే పెంచుతున్నం కూడా అంటున్నార‌ట‌. క‌ర్ణుడి చావుకి ఎన్ని రీజ‌న్స్ ఉన్న‌యో ఎవ్వ‌డికీ తెలీదు కానీ.. మా చావుకి మాత్రం ఈ స్కూల్స్ యాజ‌మాన్యాలే రీజ‌న్ అయ్యేలా ఉన్న‌య్ అని.. పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఫ్ర‌స్ట్రేట్ అవుతున్నార‌ట‌.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle