newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శ్రీవారి హుండీలోకి ఎక్కువ మొత్తంలో ఎవరెవరు డబ్బు వేస్తున్నారా అని చూశారు.. ఆ తర్వాత..!

24-03-202124-03-2021 15:57:47 IST
Updated On 24-03-2021 16:08:18 ISTUpdated On 24-03-20212021-03-24T10:27:47.402Z24-03-2021 2021-03-24T06:53:46.629Z - 2021-03-24T10:38:18.071Z - 24-03-2021

శ్రీవారి హుండీలోకి ఎక్కువ మొత్తంలో ఎవరెవరు డబ్బు వేస్తున్నారా అని చూశారు.. ఆ తర్వాత..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుమల శ్రీనివాసుని హుండీలో చోరీకి ప్రయత్నం చేశాడు. స్వామి దర్శనం తరువాత హుండీలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. అలా హుండీలోకి కానుకలు వేయాలని వచ్చిన ఒక వ్యక్తి.. హుండీలో నుంచి ఏకంగా రూ. 30 వేలను చోరీ చేశాడు. ఇక తిరుమలలో సీసీ కెమెరా కన్నుల నిఘా నుండి సదరు యువకుడు తప్పించుకోలేకపోయాడు.. విజిలెన్స్ అధికారులకు అతడు చోరీ చేస్తున్నాడని స్పష్టంగా తెలిసిపోయింది. వారి ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. అతడితో పాటూ మరికొందరు ఉన్నట్లు కూడా గుర్తించారు. 

మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. ఎక్కువ నగదుతో హుండీ దగ్గరకు వస్తున్న వారిని గుర్తించారు. నిందితుల్లో ఒకరు హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించి ముందున్న భక్తులు వేసిన నగదును హుండీలో పడకముందే పట్టుకుని మరో నిందితుడికి అందజేశాడు. వారికి అక్కడే ఉన్న మరో వ్యక్తి సాయంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ కెమెరాల ద్వారా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆలయం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోని దిగిన సిబ్బంది మొత్తం ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్ గోపినాథ్ జట్టీ మాట్లాడుతూ.. ఆలయం పరిసరాలు దాటి వెళ్లకముందే మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వారి వద్ద దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనంతరం వారిని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించామని తెలిపారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా 50 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 52,414 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.98 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24,111 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle