newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

15-04-202115-04-2021 08:54:12 IST
Updated On 15-04-2021 09:28:03 ISTUpdated On 15-04-20212021-04-15T03:24:12.692Z15-04-2021 2021-04-15T03:24:05.493Z - 2021-04-15T03:58:03.381Z - 15-04-2021

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ ఔటర్ రింగ్‌ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కంటైనర్ వాహనం, మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్‎లో చిక్కుకున్న డ్రైవర్ మంటల్లోనే సజీవదహనం అయ్యాడు. అతడితో పాటూ మరో వ్యక్తి కూడా సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడుతో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఔటర్ పై పెద్దఎత్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్ నుండి రొయ్యల కంటైనర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదులోని అప్పా జంక్షన్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భారీ కంటైనర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంటైనర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మంటల్లో సూరజ్ అనే డ్రైవర్ కాలిపోయాడు, మూర్తునుజన్ అనే క్లీనర్ కూడా మరణించారు.

ఏసి కంటెనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్ ఓ లారీని ఢీకొట్టింది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని చెబుతున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చెసే లోపే రెండు ప్రాంణాలతో పాటు కంటైనర్ అగ్నికి అహుతి అయింది. ప్రమాదంలో మొదట క్యాబిన్ తుక్కుతుక్కు అయ్యింది. ఆ తర్వాత వెంటనే వాహనం నిప్పుల్లో చిక్కుకుంది. ఆ కంటైనర్ నుండి బయట పడాలని అనుకున్నప్పటికీ వీలు పడలేదు.. స్థానికులు కూడా కాపాడాలని ప్రయత్నించగా.. అప్పటికే వారు సజీవదహనం అయ్యారు. రొయ్యలు రోడ్డు మీద పడిపోవడంతో పాటూ ఈ ప్రమాదం కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle