newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కి హై అలర్ట్‌

27-09-202127-09-2021 19:51:24 IST
2021-09-27T14:21:24.456Z27-09-2021 2021-09-27T14:11:24.178Z - - 19-01-2022

తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కి హై అలర్ట్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అంతా భారీ వర్షం నిరంతరాయంగా కురుస్తోండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో అయిదారు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నేడు, రేపు హై అలర్ట్‌ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాలలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకి వాగులు, వంకలు పొంగి పొరలుతుండడంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మరో మూడు రోజుల పాటు ఈ వర్ష ప్రభావం ఇలాగే ఉంటుందన్న సంకేతాలు వాతావరణ శాఖ తెలుపుతుండడంతో అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ళల్లో నుండి జనాలు బయటికి రావద్దని అధికారులు కోరుతున్నారు. 

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

   5 hours ago


అత్యధికంగా కరోనా పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాగా మేడ్చల్‌ మల్కాజిగిరి

అత్యధికంగా కరోనా పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాగా మేడ్చల్‌ మల్కాజిగిరి

   5 hours ago


పాంగోంగ్‌పై అక్రమ వంతెనను పూర్తిచేస్తున్న చైనా

పాంగోంగ్‌పై అక్రమ వంతెనను పూర్తిచేస్తున్న చైనా

   11 hours ago


ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్వ్యూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్వ్యూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

   17 hours ago


తెలంగాణలో కరోనా తీవ్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా తీవ్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

   17-01-2022


మంత్రి కేటిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

మంత్రి కేటిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

   17-01-2022


తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ విధించేందుకు యోచన..?

తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ విధించేందుకు యోచన..?

   17-01-2022


సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం

   16-01-2022


సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

   16-01-2022


రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ

రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ

   15-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle