newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రామ మందిర విరాళాలు..కోట్ల‌కి కోట్లు స్వాహా

17-04-202117-04-2021 08:41:40 IST
Updated On 17-04-2021 08:56:52 ISTUpdated On 17-04-20212021-04-17T03:11:40.589Z17-04-2021 2021-04-17T03:11:12.721Z - 2021-04-17T03:26:52.928Z - 17-04-2021

రామ మందిర విరాళాలు..కోట్ల‌కి కోట్లు స్వాహా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

స్వాహా అంటే ఎవ‌రూ తిన‌లేదు లెండి. రామ్ మందిర్ నిర్మాణం కోసం వ‌చ్చిన డ‌బ్బులు మాయం అయ్యాయి అంతే. మాయం అయ్యాయి అన‌డం కంటే కూడా.. వ‌చ్చే డ‌బ్బులు రాకుండా పోయాయి. వ‌చ్చాయిలే అని లెక్క‌లేసుకున్న డ‌బ్బులు లెక్క‌లోకి రాని ప‌రిస్థితి  ఎదురైంది. ఇప్పుడు తిరిగి అడ‌లేని ప‌రిస్థితి ఎదురైంది. 

ఎందుకంటే.. రామ్ మందిర్ నిర్మాణం కోసం.. విరాళాల సేక‌ర‌ణ గురించి తెలిసిందే క‌దా. ఊరూ వాడా వసూళ్లు చేశారు. భ‌క్తితో ఇచ్చినంతా తీసుకున్నారు. ప‌ది రూపాయిల ద‌గ్గ‌ర్నుంచి.. ఎవ‌రికి న‌చ్చినంతా.. ఎవ‌రికి చేత‌నైనంతా.. ఎవ‌రికి కుదిరినంతా  వాళ్లిచ్చారు. ఉడ‌తా భ‌క్తి కొంద‌రిది.. కొండంత భ‌క్తి కొంద‌రిది. ఇచ్చిన డ‌బ్బుతో భ‌క్తిని కొల‌మానం చేయ‌డం క‌రెక్ట్ కాదు కానీ.. ఎవ‌రికి తోచినంతా వాళ్లిచ్చారు అనుకోవ‌చ్చు. అలా ఇచ్చిన వారిలో కొంత‌మంది పెద్ద అమౌంట్ లు ఇచ్చారు. మ‌రి పెద్ద అమౌంట్ లు ఇచ్చే టైంలో.. చెక్ లు ఇవ్వ‌డం ఆన‌వాయితీ క‌దా. పైగా అలా చెక్కు రూపంలో ఇస్తే.. వాటికి ట్యాక్స్ మిన‌హాయింపులు గ‌ట్రా ఉంట‌య్ కావ‌చ్చు. 

వాళ్లు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది వ‌దిలేస్తే.. వేల‌కి వేల చెక్కులు కూడా వ‌చ్చాయి. వాటిలో 15 వేల చెక్ లు బౌన్స్ అయ్యాయట‌. 15 వేల చెక్కులు బౌన్స్ అయితే.. అందులో ఉన్న అమౌంట్ మొత్తం లెక్క‌లేస్తే.. 22 కోట్లు దాకా ఉన్నాయ‌ట‌. ఈ విష‌యం అయితే అఫీషియ‌ల్ గా బ‌య‌టికి రాలేదు కానీ.. టాక్ అయితే ఉంది. మ‌రి ఆ చెక్ లు ఇచ్చిన వారిని మ‌ళ్లీ అడ‌గ‌లేరు కావ‌చ్చు. వాళ్ల ఇంటిదాకా వెళ్లి.. చెక్ బౌన్స్ అయింది. ఇంకో చెక్ రాయండి..  లేదంటే క్యాష్  ఇవ్వండి.. లేదంటే ట్రాన్స్ ఫ‌ర్ చేయండి అన‌లేరు కావ‌చ్చు. అలాగే చెక్ బౌన్స్ అయింది అని.. కేస్ లు కూడా పెట్ట‌లేరు క‌దా. ఏదో దేవుడి మీద భ‌క్తితో ఇచ్చిన  చెక్ బౌన్స్ అయినంత మాత్రాన‌.. కేసులేస్తారా అంటారు. మ‌రి ఈ డ‌బ్బు ప‌రిస్థితి  ఏంటి.. వ‌దిలేస్తారా.. మ‌ళ్లీ తెప్పిస్తారా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle