ఏపీలో సెంట్రల్ జైలుకు కూడా పాకిన కరోనా..!
03-04-202103-04-2021 07:26:39 IST
2021-04-03T01:56:39.788Z03-04-2021 2021-04-03T01:56:37.152Z - - 20-04-2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు కూడా కరోనా మహమ్మారి పాకింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని 8 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడ్డారు. గురువారం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. శుక్రవారం మరో 8 మందికి పరీక్షలు చేయించగా వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్టు జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. మరింత మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జైలులో కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని అన్నారు. జైలు లోకి కరోనా మహమ్మారి ఎలా వచ్చిందా అని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత ఉధృతంగా ఉందని.. రోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసులను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,116 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,288 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 9,04,548కి పెరిగింది. గుంటూరు జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు 300 దాటాయి. ఈ జిల్లాల్లో తాజాగా 311 మందికి వైరస్ సోకగా.. చిత్తూరులో 225, విశాఖపట్నంలో 191, కృష్ణాలో 164, నెల్లూరులో 118, ప్రకాశంలో 62, శ్రీకాకుళంలో 54 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో 610 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,88,508కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 7225కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోంది. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడమే ముఖ్యమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.

ముద్దిస్తా ఆపుతావా... పోలీస్ షాక్
21 hours ago

స్కూళ్ల ప్లానే వేరు.. ఎంతన్నా విద్యావంతులు కదా
18-04-2021

రామ మందిర విరాళాలు..కోట్లకి కోట్లు స్వాహా
17-04-2021

ఎండలు చల్లార్చే వానా.. బతుకులు తెల్లార్చే వానా
15-04-2021

విశాఖ జిల్లాలో దారుణ ఘటనలు..!
15-04-2021

37 రోజుల్లో ఒకే అమ్మాయితో 3 విడాకులు..4 పెళ్లిళ్లు, 5వ పెళ్లికి ట్విస్ట్
15-04-2021

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
15-04-2021

గోదావరిలో మనుషుల్ని తినే చేపలు
15-04-2021

కాటి కాపరికి 9 మంది భార్యలు.. ఆస్తి కోసం కాపరిపై హత్యాయత్నం
14-04-2021

తెలంగాణకు వర్ష సూచన.. తడిసిన హైదరాబాద్
14-04-2021
ఇంకా