newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణకు వర్ష సూచన.. తడిసిన హైదరాబాద్

14-04-202114-04-2021 08:44:22 IST
Updated On 14-04-2021 10:25:58 ISTUpdated On 14-04-20212021-04-14T03:14:22.204Z14-04-2021 2021-04-14T03:01:33.868Z - 2021-04-14T04:55:58.402Z - 14-04-2021

తెలంగాణకు వర్ష సూచన.. తడిసిన హైదరాబాద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. రంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని... వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. కూకట్‎పల్లి, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, బోరబండ, రహ్మాత్‎నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

హైదరాబాద్ వాతావరణం గత రాత్రి ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇన్ని రోజులూ హాట్ సిటీగా ఉన్నది కాస్తా కూల్ సిటీగా మారిపోయింది. తెల్లవారుజాము నుండే ప్రారంభమైన వర్షం నెమ్మదిగా నగరంలో పలుచోట్ల వ్యాపించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో ఉదయమే వాతావరణం చల్లబడింది. ఎండలతో  సతమతమైన ప్రజలు వాతావరణం చల్లబడటంతో భానుడి భగభగలు, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలపడంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశ మున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle