newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

28-09-202028-09-2020 12:16:04 IST
2020-09-28T06:46:04.074Z28-09-2020 2020-09-28T06:46:00.692Z - - 25-10-2020

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రామ్ పూర్ (ఉత్తర ప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కొండ చిలువను కాపాడారు ఫారెస్ట్ పోలీసులు..! రామ్ పూర్ జిల్లాలోని సిహారి గ్రామంలో ఆదివారం నాడు ఓ భారీ కొండచిలువ కనిపించింది. అప్పుడే ఏదో జీవిని మింగినట్లుగా కనిపించగా.. కదల లేకుండా పోయింది. ఆదివారం నాడు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఈ కొండా చిలువ కనిపించింది. 

సాధారణంగా తినే జంతువు కంటే మరేదో జంతువును మిగిందని స్థానికులు భావించారు. కనీసం కదలడానికి కూడా ఆ కొండ చిలువకు వీలు కాలేదు. ఆ కొండచిలువను చూస్తూ స్థానికులు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 

డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 'మాకు గ్రామస్థులు సమాచారం ఇవ్వగానే ఆ ప్రాంతానికి చేరుకున్నాము.. సిహారి గ్రామంలో ఆ కొండచిలువ కనిపించింది. మా టీమ్ కొండ చిలువను పరిశీలించి.. స్థానికంగా ఉన్న అడవిలో వదిలిపెట్టి వచ్చారు. ఆ కొండచిలువ మేకను మింగినట్లు ఉంది. అందుకే కదలలేకపోయింది. స్థానికులు భయపడ్డారు. మేము వారిని ఆందోళన చెందకండి అని చెప్పాము.. కొండ చిలువలు విషపూరితమైనవని కావని వారికి చెప్పామని' అన్నారు. ఆ కొండ చిలువను ఓ ట్రాక్టర్ లో వేసుకుని తరలించారు అధికారులు.    


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle