newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ‌గ‌వారికి కూడా ప్ర‌గ్నెన్సీ సెల‌వులు

03-04-202103-04-2021 12:29:42 IST
2021-04-03T06:59:42.364Z03-04-2021 2021-04-03T02:33:52.716Z - - 20-04-2021

మ‌గ‌వారికి కూడా ప్ర‌గ్నెన్సీ సెల‌వులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జింగ్ జింగ్ ఇది అమేజింగ్. మ‌గ‌వారికి ప్రెగ్నెన్సీ రాదు క‌దా.. వారికి సెల‌వులేంటి అనిపిస్తుంది. ఆడవారంటే.. ప్ర‌గ్నెంట్ అవుతారు. న‌వ‌మాసాలూ బిడ్డ ని మోసి.. హాస్పిట‌ల్స్ కి తిరుగుతూ ఉండాలి. ఎన‌క‌టికి అంటే.. హాస్పిట‌ల్స్ కి వెళ్లే వారు కాదు. కానీ.. రీసెంట్ గా అయితే.. హాస్పిట‌ల్స్ కి ద‌గ్గ‌ర్లో అద్దెకి తీసుకుని మ‌రీ ఉండే వాళ్లు ఉన్నారు. అలా ఉంది సిచ్చువేష‌న్. ప్ర‌తి సెక‌నూ డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉంటారు. అంత ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నా.. స‌ర్జ‌రీ లేకుండా డెల‌వరీ కాదు.. అది వేరే విష‌యం.

అయితే.. ప్ర‌గ్నెన్సీ సెల‌వులు.. ఆడ‌వారికి అన్ని చోట్లా ఉన్న‌య్. ప్రైవేటు వారు ఇంకా సరిగా ప‌ట్టించుకోక పోయినా.. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు చేసే వారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ప‌ని చేసే వారికి మాత్రం ఈ ఫెసిలిటీ బానే ఉంది. అయితే.. మ‌రి ప్ర‌గ్నెన్సీ సెల‌వులు ఆడ‌వారికేనా.. మ‌గ‌వారికి ఉండొద్దా అనే డిమాండ్ చాలా కాలం నుంచీ ఉంది. ఎందుకంటే.. భార్య ప్ర‌గ్నెంట్ అయితే భ‌ర్తే క‌దా ద‌గ్గ‌రుండి చూసుకోవాల్సింది. గ‌తంలో అంటే ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవి. ఈ రోజుల్లో అలా బ‌త‌క‌డం లేదు క‌దా జ‌నాలు. అందుకే.. భ‌ర్తే ద‌గ్గ‌రుండి చూసుకోవాలి. అలా భ‌ర్త ఇంటి ద‌గ్గ‌ర ఉండ‌లేక‌.. భార్యని వ‌దిలి ఉద్యోగానికి వెళ్ల‌లేక ఇబ్బందులు ప‌డుతున్న వారు ఎంతో మంది. వారి కోసం వ‌చ్చిందే ఈ డిమాండ్. భర్త‌కి కూడా ప్ర‌సూతి సెల‌వులు ఇస్తే.. డెల‌వ‌రీ టైంలో సెల‌వులు తీసుకుని.. డెలివ‌రీ అయ్యాక‌.. బేబీని చూసుకుంటూ మురిసిపోయే అవ‌కాశం వ‌స్తుంది. 

అయితే మ‌నోళ్లు మామూలుగానే సెల‌వులు ఇవ్వ‌రు క‌దా. కానీ.. స్వీడ‌న్ కు చెందిన ఓల్వో ఇండియా కంపెనీ మాత్రం సెల‌వుల‌కు ఓకే అనేసింది. మ‌హిళ‌ల‌తో పాటు మ‌గ‌వారికి కూడా ప్ర‌సూతి సెల‌వులు ఇవ్వాలి అని డిసైడ్ అయింది. భార్య ప్ర‌గ్నెంట్ గా ఉన్న‌ప్పుడు భ‌ర్త ప‌క్క‌నే ఉండి చూసుకుని.. మూడు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావ‌చ్చు అనే ఆప్ష‌న్ ఇచ్చింది. దీంతో స్వీడ‌న్ కంపెనీ ఓల్వో ఇండియా నిర్ణ‌యాన్ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle