newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సమ్మర్ కదా అని కరెంట్ ను విచ్చలవిడిగా వాడేయకండి.. బిల్లు చూసి షాక్ అవుతారు..!

06-04-202106-04-2021 12:59:51 IST
2021-04-06T07:29:51.542Z06-04-2021 2021-04-06T04:15:33.429Z - - 11-04-2021

సమ్మర్ కదా అని కరెంట్ ను విచ్చలవిడిగా వాడేయకండి.. బిల్లు చూసి షాక్ అవుతారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎండాకాలం వచ్చేసింది.. మనకు ఉన్న వేడికి ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు ఆడుతూ ఉండాల్సిందే. విచ్చలవిడిగా కరెంట్ ను వాడేసుకుంటే కరెంట్ బిల్లులను చూసి షాక్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ను ఈ నెల నుంచి అమల్లోకి తెచ్చారు. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి దీన్ని ఖరారు చేసి విడుదల చేసింది. ముఖ్యంగా నెలకు 225 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులకు భారీగా కరెంట్ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. మూడు విభాగాలుగా విభజించి.. ప్రత్యేకంగా రేట్ లను ఫిక్స్ చేశారు. 

టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకారం గృహ వినియోగదారులను మూడు గ్రూపులుగా విభజించారు. నెలకు 75 యూనిట్ల విద్యుత్‌ వాడేవారు ఎ-గ్రూప్‌ కిందకు వస్తారు. మొదటి యాభై యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.1.45, తర్వాతి పాతిక యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 వసూలు చేస్తారు.  ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం నెలకు 150 యూనిట్లు ఉచితంగా ఇస్తే, ఈ ప్రభుత్వం దాన్ని 200 యూనిట్లకు పెంచింది.

నెలకు 225  యూనిట్లకు లోబడి వాడేవారిని బి-గ్రూప్ లోకి చేర్చారు. వీరికి మొదటి వంద యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.2.60,  తర్వాత వంద యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.3.60, ఆ తర్వాతి పాతిక యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.6.90 చొప్పున వసూలు చేస్తారు. 

నెలకు 225 యూనిట్లు దాటిన వారిని సి-గ్రూప్ లోకి చేరుస్తారు.  మొదటి యాభై యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.2.65 , తర్వాతి యాభై యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.3.35, ఆ తర్వాతి వంద(101-200)యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.5.40, ఆ తర్వాత వంద(201-300)యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.7.10, ఆ తర్వాత వంద(301-400) యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.7.95, ఆ తర్వాత వంద(401- 500)యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.8.50, ఆపై(500 దాటిన యూనిట్లకు) ఒక్కో యూనిట్‌కు రూ.9.90 వసూలు చేస్తారు. బి- గ్రూప్‌లో ఉన్న వినియోగదారుడు నెలకు 225 యూనిట్లు వాడితే దానికి రూ.792 చెల్లించాల్సి ఉండగా, సి-గ్రూప్ లోని  వినియోగదారుడు 225 యూనిట్లకు రూ.1,017 చెల్లించాల్సి వస్తుంది. సి-గ్రూప్ లో నెలకు 300 యూనిట్లు వాడితే బిల్లు రూ.1,550 వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఏ నెలకు ఆ నెల లెక్క గట్టి గ్రూప్‌ను నిర్ణయిస్తున్నారు. దీనివల్ల వేసవిలో ఎండలు అధికంగా ఉన్న సమయంలో కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇది వినియోగదారులకు లాభమేనని, శీతాకాలంలో బిల్లులు తగ్గుతాయని అధికారులు  చెబుతున్నారు. 

ఇక ప్రతి బిల్లులో కనీస విద్యుత్‌ చార్జీ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో ఒక కిలోవాట్‌ కరెంటు వాడకానికి నెలకు పది రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల విద్యుత్‌ సంస్థలకు కొంత ఆదాయం పెరుగుతుందని నియంత్రణ మండలి తెలిపింది. వేసవిలో ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువగా ఉన్నందువల్ల కిలోవాట్‌ రూపంలో వినియోగం ఎక్కువ ఉంటుందని, ఆ రకంగా ఎక్కువ ఆదాయం వస్తుందని వాటి అంచనా వేస్తున్నారు.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle