newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముద్దిస్తా ఆపుతావా... పోలీస్ షాక్

19-04-202119-04-2021 10:11:06 IST
Updated On 19-04-2021 10:36:33 ISTUpdated On 19-04-20212021-04-19T04:41:06.466Z19-04-2021 2021-04-19T04:38:17.435Z - 2021-04-19T05:06:33.516Z - 19-04-2021

ముద్దిస్తా ఆపుతావా... పోలీస్ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంది త‌ల్లీ. ఏందిది. ఓ ప‌క్క ఎంత  మొత్తుకుంటున్న‌మ్. స‌మ‌జైత‌లేదా. బ్రెయిన్ పంజేస్త‌లేదా అంటూ.. ఓ పోలీస్. ఏందాయ్ నీ లొల్లి. న‌క్రాల్ జెయ్య‌మాక అంటూ  ఆమె లొల్లి. అయితే ఇది తెలంగాణ‌లో కాదులెండి. ఇలాంటి డిస్క‌ష‌నే.. ఢిల్లీలో జ‌రిగింది. 

ఈ ఫోటో చూస్తే అర్దం అవుతూనే ఉంది క‌దా. పోలీసుల్ని జ‌నాలు అస‌లు లెక్క చేసే ప‌రిస్థితిలో లేరు. ఆడాళ్లైతే ఇంకేం అన‌లేరులే అనే ధీమా. మొన్నా మ‌ధ్య అమెరికాలోనో ఏదో దేశంలో కూడా ఇలాగే జ‌రిగింది క‌దా. మాస్క్ పెట్టుకో అమ్మా అన్నందుకు.. కార్ లో గోల గోల చేసింది. మాస్క్ తీసేసి మీద ద‌గ్గింది. ఆయ‌న మాస్క్ ని గుంజుకుంది. పెప్ప‌ర్ స్ప్రే కూడా కొట్టిన‌ట్లుంది ఓ అమ్మాయి. ఫైన‌ల్ గా డ్రైవ‌ర్ పై ఆమే కేస్ పెట్టింది. ఆడ పిల్ల‌పై ఓవ‌ర్ యాక్ష‌న్ చేశాడు. ప‌ర్స్ లాక్కున్నాడు అంటూ.. కేసు పెట్టింది. డ్రైవ‌ర్ ప్రూఫ్ బ‌య‌ట పెట్ట‌డంతో.. ఆమెకు 16 ఏళ్లు శిక్ష  వేసింది అక్క‌డి కోర్టు.

ఇక ఫారిన్ కంట్రీ నుంచి ఢిల్లీకి  వ‌ద్దాం. పైన ఉన్న ఫోటోలోని లేడీని పోలీస్ ఆపాడు. మాస్క్ పెట్టుకోమ్మా అన్నాడు. ఏంటి మాస్క్ పెట్టుకోకుండా.. చెబితే అర్దం కావ‌డం లేదా అని సీరియ‌స్ గానే చెప్పుంటాడు. వాళ్లు మాత్రం నిదానంగా ఎంత మందికి చెబుతారు. నిదానంగా చెబితే మాత్రం వింటారా. అందుకే సీరియ‌స్ గా చెప్పుంటాడు. ఇక అక్క శివంగిలా మారింది.  పోలీస్ పై  రివ‌ర్స్ అయింది. పాపం పోలీస్.. ఆడ మ‌నిషి అడ్డం తిరిగి గొడ‌వ చేస్తుంటే ఏం చేయ‌గ‌ల‌డు. ప‌క్క‌నే లేడీ పోలీస్ లేరు కావ‌చ్చు. ఉంటే గుంజి ప‌క్క‌నేసే వాళ్లే కానీ.. ఇక ఆమెను ఆపే దిక్కు లేకుండా పోయింది. త‌ను కూడా ఊరికే ఏం అన‌లేద‌ట‌.

ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ న‌డుస్తోంది. వీకెండ్ లో షికార్లు ఆపండి.  క‌రోనా క‌దా వ‌ద్దులే.. కాస్త ఇంట్లోనే ఉండండి అనేది ఆ లాక్ డౌన్ ఉద్దేశం. కానీ.. ఈ జంట మాత్రం ఆగ‌లేదు. పైగా.. మా ఆయ‌న‌కి ఇక్క‌డే ముద్దు పెడ‌తా.. నువ్వేమైనా ఆపుతావా. ఏంది నీ లొల్లి.. మేం ప్రేమ ప‌క్షులం.. ప్రేమ‌లో విహ‌రించాలి. అస‌లే వీకెండ్.  వారం అంతా ప‌నుల్లో చ‌స్తున్నం. వీకెండ్ లో కాసేపు జాలీగా బ‌య‌టికి రావ‌ద్దా అంటూ గొడ‌వేసుకుంది. వీకెండ్ లో బ‌య‌టికి రావాలి క‌రెక్టే.. రిలాక్స్ అవ్వాలి క‌రెక్టే. కానీ.. బ‌య‌ట క‌రోనా కాసుకుని కూర్చుంది క‌దా. అందుకే దాన్నుంచి మిమ్మ‌ల్ని కాపాడ్డానికి  మేం కాప‌లా ఉన్నం. మీరు వినాలి క‌దా అంటూ పోలీస్  వాద‌న‌. కానీ.. ఆ అమ్మాయి విన‌నే విన‌లేదు. గోల గోల చేసింది. అయినా.. మా ఆయ‌న‌కి ఇక్క‌డే ముద్దు పెడ‌తా నువ్వు ఆపుతావా అంటే.. ఆ పోలీస్ మాత్రం ఏం మాట్లాడాలి చెప్పండి. ఇక ట‌యానికి మ‌హిళా కానిస్టేబుల్ రావ‌డంతో..  కూల్ అయింది ఎవ్వారం. వాళ్లాయ‌న్ని అరెస్ట్ చేశారు. ఆమెను కూడా అరెస్ట్ చేస్తాం అంటున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle