newssting
Radio
BITING NEWS :
పదవి నుంచి దిగిపోనున్న అమెరికా ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ సలహాదారు రాజీనామా చేశారు. ట్రంప్ సలహాదారు అయిన స్కాట్ అట్లాస్ తన రాజీనామా లేఖను మంగళవారం పంపించారు * కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది * ఆల్‌ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్‌ సీటు కోల్పోయాడు. అక్టోబర్‌ 31న తన రోల్‌నెంబర్‌పై అప్‌డేట్ల కోసం నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా విత్‌ డ్రా ఫ్రం సీట్‌ అలకేషన్‌ అండ్‌ ఫరదర్‌ రౌండ్స్‌ లింక్‌ను తను క్లిక్‌ చేయడంతో సీటు కోల్పోయాడు * ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘బురేవి’ వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతాల్లో మంగళవారం మరో సారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది * దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య తిరిగి వంద దాటింది. కరోనాతో మొత్తం 108 మంది మృతి చెందారు. ఇదే సమయంలో కొత్తగా 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి * కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఆరు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ మూడో దఫా చర్చలు జరగనున్నాయి * శ్రీలంకలోని మహారా జైలులో ఘర్షణలు చోటు చేసుకుని ఎనిమిది మంది ఖైదీలు మృతి. మరో 37 మందికి గాయాలు. వారిలో ఇద్దరు జైలర్లు ఉండగా గాయాలపాలైన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది * సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వెళ్లే శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల ముందే రైల్వేస్టేషన్‌ నుండి బయల్దేరడంతో.. రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు * యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురి చేసేలా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఏర్పాట్లు చేశారు * నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు * నేటితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు. కార్తిక సోమవారం సందర్భంగా ఘాట్లలో నిన్న భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. నేడు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పుష్కరాల ముగింపు వేళ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా * తమిళనాడుకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా.. తర్వాత తుపానుగా మారనుంది. ఇది బుధవారం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది * టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు ఊహించని షాక్‌. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో భారీ జరిమానా. త్రిశూల్‌ సిమెంట ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయం.

పావురం ధర పద్నాలుగు కోట్లు ఏంటి సార్..?

16-11-202016-11-2020 08:01:18 IST
Updated On 16-11-2020 10:20:23 ISTUpdated On 16-11-20202020-11-16T02:31:18.752Z16-11-2020 2020-11-16T02:31:03.190Z - 2020-11-16T04:50:23.835Z - 16-11-2020

పావురం ధర పద్నాలుగు కోట్లు ఏంటి సార్..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పావురాలతో పోటీలు నిర్వహిస్తూ ఉంటారని చాలా మందికి తెలుసు. ఇలా పావురాలకు రేస్ లను పెట్టి పెద్ద మొత్తంలో సంపాదించేవారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం ఆ పావురాలకు మంచి ఫుడ్, మంచి సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. ఇలాంటి పోటీల కోసమే కొందరు పావురాలను పెంచుతూ ఉంటారు. భారతదేశంలో కూడా కొందరు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి పావురాలను కొంటూ ఉంటారు. కానీ ఓ పావురాన్ని ఏకంగా 14 కోట్ల రూపాయలకు కొన్నాడు ఓ వ్యక్తి. పావురానికి 14 కోట్లు ఏంటని మీరు షాక్ అవుతూ ఉన్నారా..? ఈ స్టోరీని చావడండీ. 

14 కోట్ల రూపాయల ఖరీదైన పావురం పేరు ‘న్యూ కిమ్‌’. ‘పి‌జన్‌ ప్యార‌డైజ్‌’ ఆన్‌‌లై‌న్‌లో నిర్వహించిన వేలంలో ఇది రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు అమ్ముడుపోయింది. పావురాల పోటీలో పేరొందిన ఈ న్యూకిమ్‌ను చైనాకు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసు‌కు‌న్నారు. ‘న్యూ కిమ్’గా పిలిచే ఓ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ.1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి దానిని కొనుక్కున్నాడు. ఓ పావురం ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు. గత ఏడాది ఓ మగ కపోతం ‘అర్మాండో’ 1.25 మిలియన్ యూరోలకు అమ్ముడుపోగా.. ఇప్పుడా రికార్డును ‘న్యూ కిమ్’ బద్దలుగొట్టిందని పిపా తెలిపింది. ‘న్యూ కిమ్’ 2018లో జరిగిన ‘ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్’ పోటీల్లో విజేతగా నిలవడంతో పలువురు పోటీ దారులు దీన్ని కొనుక్కోడానికి పోటీ పడ్డారు. 

ఇది చదవండి: బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

రెండేళ్ల వయసున్న ‘న్యూ కిమ్’ను 200 యూరోల బేస్ ప్రైస్‌తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయింది. తనకు తెలిసినంత వరకు ఇది ప్రపంచ రికార్డు అని, ఇంత ధరకు పావురం అమ్ముడైన దాఖలాలు లేవని పి‌జన్‌ ప్యార‌డైజ్ చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ అన్నారు.

డ్రగ్స్ వాడకంలో ఎవరికీ తీసిపోని భారత్..

డ్రగ్స్ వాడకంలో ఎవరికీ తీసిపోని భారత్..

   30-11-2020


టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

   29-11-2020


నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

   28-11-2020


ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

   27-11-2020


శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

   27-11-2020


నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

   27-11-2020


పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

   27-11-2020


ఏపీని వణికిస్తున్న నివర్..!

ఏపీని వణికిస్తున్న నివర్..!

   27-11-2020


సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

   25-11-2020


చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

   25-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle