పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
21-01-202121-01-2021 13:17:03 IST
Updated On 21-01-2021 13:18:07 ISTUpdated On 21-01-20212021-01-21T07:47:03.894Z21-01-2021 2021-01-21T07:07:55.990Z - 2021-01-21T07:48:07.528Z - 21-01-2021

పిడకలు అమ్ముతారు అంటే.. ఏమోలే ఎక్కడైనా దుకానం పెట్టారేమో అనుకుంటాం. కొంత తెలిసిన వాళ్లైతే.. ఈ కామర్స్ సైట్స్ లో అమ్ముతారు. ఆన్ లైన్ పోర్ట్స్ లో కూడా ఉంటుంది అంటారు. వాటి రేటు చూసి మాత్రం అంతా షాక్ అవుతుంటారు. మేమేస్ లో కూడా ఇది ట్రెండింగ్ లో ఉంటుంది. సర్కాస్టిక్ గా ఇది ఫన్నీ న్యూసే. కానీ.. ఇప్పుడు ఆన్ లైన్ లో అమ్మడం.. వందల్లో రేట్లు ఉండడం కాదు మ్యాటర్. వాటి మీద ఇచ్చిన రివ్యూ పాపులర్ అయింది. ఆ రివ్యూ ఏందయ్యా అంటే.. ఓ సారు వారు ఆన్ లైన్ లో పిడకలు కొన్నాడు. అందరూ షాకయ్యే రేటే చెల్లించాడు. తర్వాత రివ్యూ ఇచ్చాడు. ఇంత వరకూ ఓకే. కానీ.. అవి టేస్ట్ బాలేవంట. మట్టి మట్టిగా ఉన్నయ్. రుచీ పచీ లేకుండా చేశారు. ఈ మాత్రం రుచి లేని పిడకలకి ఇంత రేటా. ఏంటండీ ఇదీ అని రివ్యూ పెట్టేశాడు. ఇంకేముంది.. సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. పిడకలు కొన్నది తినడం కోసమా నాయనా.. పిడకల్ని అప్పలు అనుకుని తిన్నవా.. కేక్ ముక్కలు అనుకుని తిన్నవా.. గుండ్రంగా ఉన్నయ్ కదా బిస్కెట్లు అనుకుని తిన్నవా అన్నది హాట్ టాపిక్ అయింది. అంతా ట్రెండింగ్ చేస్తున్నారు. టేస్ట్ గురించి ఇంకాస్త ఎక్స్ ప్లెయిన్ చేస్తే బావుండేది అంటూ.. ఫన్నీగా కామెంట్లు చేస్కుంటున్నారు. ఇక్కడే ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ రివ్యూని కూడా లైక్ చేసిన వాళ్లున్నారు. హెల్ప్ ఫుల్ అని బటన్స్ నొక్కారు. అదేంటి.. పిడకలు రుచిగా లేవు అంటే.. అదెట్టా హెల్ప్ ఫుల్ అవుతుంది. కేక్ రుచిగా లేదు.. సద్దివాసన వస్తుంది.. స్వీట్ తక్కువ ఉంది అని రివ్యూ ఇస్తే.. బాలేదేమోలే.. మాకూ హెల్ప్ అయింది.. లేదంటే మేమూ కొని తినేవాళ్లం అని.. హెల్ప్ ఫుల్ బటన్ నొక్కుతారు. మరి ఇట్టెట్టా హెల్ప్ ఫుల్ అయిందబ్బా అంటూ నవ్వకుంటున్నారు ఇది చూసిన వాళ్లు. ఈ రివ్యూకి హెల్ప్ ఫుల్ అని బటన్ నొక్కిన వాళ్లు కూడా తినాలి అనుకుంటున్నారా.. లేదంటే వాళ్లు కూడా ఇలాగే తింటారా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు.

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
9 hours ago

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
10 hours ago

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021

బార్స్ ఇస్తున్నయ్ ఆఫర్స్
03-03-2021

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్
02-03-2021

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
01-03-2021
ఇంకా