newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్

19-11-202019-11-2020 07:35:14 IST
Updated On 19-11-2020 07:47:12 ISTUpdated On 19-11-20202020-11-19T02:05:14.936Z19-11-2020 2020-11-19T02:05:05.789Z - 2020-11-19T02:17:12.883Z - 19-11-2020

కరోనా వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాక్సిన్ ను పలు ఫార్మా కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయి. కానీ ఏ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుంది అనే విషయంలో సరైన క్లారిటీ ఇంకా రావడం లేదు. తాజాగా ప్రముఖ ఫార్మా సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తోందని, 95 శాతం సమర్థత ప్రదర్శించిందని ఫైజర్ ప్రకటించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్లకు పైబడిన వారిలోనూ దీని సమర్థత 94 శాతానికి పైగా ఉందని ఈ అమెరికా ఫార్మా దిగ్గజం చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతూ ఉన్నాయి. అన్ని వయసుల వారిలోనూ వ్యాక్సిన్ ప్రభావం స్థిరంగా ఉందని, త్వరలోనే యూఎస్ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉందట. కొద్దిరోజుల కిందట తమ వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలు ఇస్తోందని ప్రకటించింది ఫైజర్. తాజాగా 95 శాతం సమర్థత ప్రదర్శించినట్టు చెబుతోంది. 170 మంది కరోనా రోగులపై టీకాను ప్రయోగించగా తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు వచ్చినట్టు వివరించింది. 

రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా మంచి ఫలితాలను సాధిస్తున్న సంగతి తెలిసిందే. కోవిద్19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ టీకాను భారత్ తయారు చేసుకోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత్ తో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని పుతిన్ వెల్లడించినట్టు 'ఆర్ఐఏ' న్యూస్ ఏజన్సీ తెలిపింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రజలను కరోనా నుంచి రక్షించడంలో 92 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ను రష్యాలో వాడేందుకు ఆగస్టులోనే పుతిన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

   14 hours ago


నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

   28-11-2020


ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

   27-11-2020


శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

   27-11-2020


నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

   27-11-2020


పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

   27-11-2020


ఏపీని వణికిస్తున్న నివర్..!

ఏపీని వణికిస్తున్న నివర్..!

   27-11-2020


సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

   25-11-2020


చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

   25-11-2020


హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

   25-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle