newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

27-11-202027-11-2020 16:50:45 IST
2020-11-27T11:20:45.553Z27-11-2020 2020-11-27T11:20:32.563Z - - 21-01-2021

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 19 పైసలు బలపడి రూ. 81.89కు చేరింది. డీజిల్‌ ధర లీటర్‌కు 24 పైసలు పెరగడంతో రూ. 71.86కు చేరుకుంది. 48 రోజుల తర్వాత ఈ నెల 20న నుండి దేశీయంగా పెట్రోల్‌ ధరలు పెరగడం మొదలైంది. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ నవంబర్ 24వ తేదీ వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వచ్చాయి. గత ఆరు రోజుల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు 83 పైసలు పెరిగింది. డీజిల్‌ ధర అధికంగా లీటర్‌ రూ. 1.40 పెరిగింది. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 45 డాలర్లను అధిగమించింది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48 డాలర్లకు చేరింది. దీంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వచ్చాయి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle