newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ప‌టాసులు కాల్చుకోండిలే.. హైకోర్టు తీర్పుని దిద్దిన సుప్రీం కోర్టు

13-11-202013-11-2020 16:57:07 IST
Updated On 13-11-2020 17:02:00 ISTUpdated On 13-11-20202020-11-13T11:27:07.603Z13-11-2020 2020-11-13T11:27:00.982Z - 2020-11-13T11:32:00.519Z - 13-11-2020

ప‌టాసులు కాల్చుకోండిలే.. హైకోర్టు తీర్పుని దిద్దిన సుప్రీం కోర్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతే క‌దా. హైకోర్టే బాస్ అనుకుంటాం. కానీ పైన ఇంకో బాస్ ఉన్నారు క‌దా. త‌నే సుప్రీం కోర్టు. బాణాసంచాలు కాల్చొద్దు. రోగాలు పెరుగుత‌య్. పొగ పెరుగుద్ది పొల్యూష‌న్ పెరుగుతుంది.. వాచు కాలుష్యం అయితే త‌ర్వాత త‌ట్టుకోలేం అంటూ.. తెలంగాణ వ్యాప్తంగా బాణా సంచా కాల్చొద్దు. స్ట్రిక్ట్ నిషేధం అని చెప్పింది క‌దా హైకోర్టు. అంతే కాదు. ఇదంతా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్రభుత్వానిదే.. జ‌నానికి అవ‌గాహ‌న క‌ల్పించండి.. ప్ర‌సార మాద్య‌మాల్లో ప్ర‌సారాలు చేయండి. క్రాక‌‌ర్స్ అమ్మితే కేసులు పెట్టండి, కాల్చినా కేసులు పెట్టండి అని హైకోర్టు చెప్పింది క‌దా. 

ఇక క్రాక‌ర్స్ అమ్మేవాళ్లు ఏందిరా నాయ‌నా అని ఫీల‌య్యారు. ఇట్టా అయితే ఎట్టా సార్లో అని పెద్దోళ్ల‌తో డిస్క‌ష‌న్లు చేశారు. మ‌రి వాళ్లు ఊరుకుంటారా. అత్య‌వ‌స‌ర పిటిష‌న్ కింద సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. అంతే.. సుప్రీం కోర్టు ఇంకొన్ని క్లారిటీస్ ఇచ్చింది. కాల్చుకోండి అమ్ముకోండిలే కానీ.. రెండుగంట‌లే అని చెప్పింది. ఎనిమిది గంట‌ల నుంచి ప‌ది గంట‌ల వ‌ర‌కే ప‌ర్మిష‌న్ అని చెప్పింది. అలాగే గాలి కాలుష్యం హెవీగా ఉన్న చోట ఫుల్లుగా నిషేధించండి అని కూడా చెప్పింది సుప్రీం కోర్టు.

అలా జరిగింది. ఇక మ‌నోళ్లు ఆగుతారా చెప్పండి. మామూలుగా నిషేధం అంటేనే.. అమ్ముతారాయే కాలుస్తారాయే. ఆల్రెడీ పొద్దున సాయంత్రం అని లేకుండా మోత‌లు మోగుతునే ఉన్న‌య్. మ‌రి రెండు గంట‌లు ప‌ర్మిష‌న్ అంటే.. ఇగో ఇప్పుడే రెండు గంట‌లు త‌ర్వాత ఆపేస్తం అని క‌త‌లు చెబుత‌రు. మొత్తానికైతే.. దీపావ‌ళి పూట బాంబులు కాల్చ‌కుండా ఎలా ఉండాల్రా బాబూ అనుకునే వాళ్ల‌కి రిలీఫ్ అయితే దొరికింది.

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

   14 hours ago


నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

   28-11-2020


ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

   27-11-2020


శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

   27-11-2020


నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

   27-11-2020


పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

   27-11-2020


ఏపీని వణికిస్తున్న నివర్..!

ఏపీని వణికిస్తున్న నివర్..!

   27-11-2020


సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

   25-11-2020


చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

   25-11-2020


హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

   25-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle