newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

29-09-202029-09-2020 19:33:31 IST
2020-09-29T14:03:31.068Z29-09-2020 2020-09-29T14:03:14.637Z - - 25-10-2020

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పక్షులు మాట్లాడితే ఎంత బావుంటుందో కదా. ముఖ్యంగా చిలుక మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంటుందో. అందుకే తియ్యటి స్వరంతో మాట్లాడే వారి మాటలను చిలుక పలుకులతో పోలుస్తుంటారు. చిన్న పిల్లలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే.. చిలుకలను చూసి మురిసిపోతారు. కానీ ఓ చిలుక మాత్రం ముద్దుగా మాట్లాడట్లేదు కదా.. బూతులు మాట్లాడుతోంది. ఈ ఘటన లండన్ లోని ఒక జంతుప్రదర్శన శాలలో జరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. అక్కడున్న చిలుకలన్నీ కలిసి సందర్శకులను తిట్టడం మొదలుపెట్టాయట. 

యూకే లోని లింకన్ షైర్ వైల్డ్ లైఫ్ పార్క్ లో జరిగిందీ సంఘటన. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఆ పార్క్ కి ఐదు ఆఫ్రికన్ చిలుకలను తీసుకొచ్చారు. వాటన్నింటినీ ఒక గదిలో ఉంచారు. అయితే అవి ఎలా నేర్చుకున్నాయో తెలీదు గానీ బూతులు నేర్చుకున్నాయి. అక్కడున్న జూ కీపర్లు, ఇతర సిబ్బందిని తిట్టడం మొదలు పెట్టాయి. చిలుకలు తిడుతున్నా వారు సరదాగా తీసుకున్నారు. అప్పుడే వాటిని పట్టించుకుని సరైన పదాలు నేర్పించి ఉంటే బాగుండేదేమో. 

ఆ తర్వాత వాటిని అలాగే డిస్ ప్లే లో ఉంచారు. డిస్ ప్లే ఉన్న చిలుకలు పార్కుకు వచ్చిన సందర్శకులను మూకుమ్మడిగా బూతులు తిట్టడం మొదలుపెట్టాయి. వాటి తిట్ల దండకాన్ని వినలేక సందర్శకులు జూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ చిలుకలను డిస్ ప్లై నుంచి తొలగించారు. కాగా.. వాటిలో ఒక చిలుకకు బూతులు వచ్చి ఉంటాయని, అన్నింటినీ కలిపి ఉంచడం వల్లే ఒకదాని నుంచి ఒకటి బూతు పదాలు నేర్చుకుని ఉంటాయని పార్క్ సీఈఓ స్టీవ్ నికోలస్ వెల్లడించారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

 

 

 

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle