newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

డ‌బ్బున్నోళ్ల ఆక్సిజ‌న్ ప్లాన్స్

07-05-202107-05-2021 07:57:12 IST
Updated On 07-05-2021 10:14:42 ISTUpdated On 07-05-20212021-05-07T02:27:12.713Z07-05-2021 2021-05-07T02:26:50.758Z - 2021-05-07T04:44:42.790Z - 07-05-2021

డ‌బ్బున్నోళ్ల ఆక్సిజ‌న్ ప్లాన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్ని డ‌బ్బులుండి ఏం సుఖం చెప్పండి. క‌రోనా రాగానే పుటుక్కున చ‌చ్చారు. ఆ మాత్రం దానికి అన్ని కోట్లు సంపాదించి ఏం సుఖం.. తినీ తిన‌క కూడ బెట్టి ఏం సుఖం. అంత మందిని ముంచి.. కోట్లు కూడ బెట్టుకుని ఏం సుఖం. చివ‌రికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ దొర‌క్క  చ‌చ్చార‌ట‌. అంటూ.. జ‌నాలు ఎన్నో మాట‌లు అనుకుంటారు క‌దా. మ‌రి టైం ఎలా ఉందో అర్దం అవుతూనే ఉంది క‌దా. ఆక్సిజ‌న్ కోసం జ‌నాలు ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నామో కూడా చూస్తున్నాం క‌దా. ఆక్సిజ‌న్ కి ఓ రేంజ్ డిమాండ్ పెరిగింది. చిరుత సినిమాలో ఓ సీన్ ఉంటుంది క‌దా. హీరో హీరోయిన్ ఐలాండ్ లో ప‌డిపోయాక ఆ హీరోయిన్ ఎంత క‌రెన్సీ ఇచ్చినా.. కాల్చిన చేప‌ని కొన‌లేవు అంటాడు హీరో. 

అలాగే.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో చాలా సార్లు ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతుంట‌య్. ఇప్పుడు వ్యాక్సిన్ సెకండ్ డోసూ.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల డిమాండ్ అలాగే ఉంది. మ‌రి డ‌బ్బున్నోళ్లైనా.. చావుకి ఎక్కువేం కాదు.. క‌రోనాకి ఎక్కువేం కాదు అంటారు క‌దా. చూస్తుంటే.. డ‌బ్బున్నోళ్లు డ‌బ్బున్నోళ్లే అనిపిస్తోంది. ఎందుకంటే.. క‌రోనా వ‌చ్చినోళ్లంతా ఎక్కువ‌గా ఆక్సిజ‌న్ అంద‌క‌నే క‌దా చస్తున్నారు. మ‌రి డ‌బ్బుంటే ఆక్సిజ‌న్ దొరుకుతుంది క‌దా. దొర‌క‌డం కాదు. ముందే స్టాక్ పెట్టుకుంటున్నార‌ట‌. ఎటు పోయి ఎటు వ‌స్తుందోలే అని.. రెండు మూడు సిలిండ‌ర్లు సీక్రెట్ గా దాచుకుంటున్నార‌ట జ‌నాలు.

అయితే.. వాళ్లు నేరుగా వాళ్ల ఇళ్ల‌ల్లోకి తెచ్చుకుంటే క‌రోనా వ‌చ్చింది అని న‌లుగురు అనుకుంటారు అనే భ‌యంతో.. ఇంట్లోకి ఎవ‌రైనా వ‌చ్చినా.. ఏంటి ఇది ఇలా తెచ్చిపెట్టుకున్నారు అని అంటారేమో అని.. వాళ్ల ప‌ని వాళ్ల ఇళ్ల‌ల్లో, డ్రైవ‌ర్ల ఇళ్ల‌ల్లో.. వాళ్ల మీద డిపెండ్ అయి బ‌తికే  చిన్న చిన్న ఫ్యామిలీస్ ఇళ్ల‌ల్లో దాచుకుంటున్నార‌ట‌. మీకు క‌రోనా వ‌చ్చినా.. మాకు క‌రోనా వ‌చ్చినా ఈ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ప‌నికి వ‌స్తుంది. ఒక‌టి కాకుంటే రెండు తెచ్చి దాచి పెట్టండి అంటూ.. వాళ్లకి డ‌బ్బులిచ్చి మ‌రీ స్టాక్ పెట్టిస్తున్నార‌ట‌. వాళ్ల‌కి దొర‌క్క పోయినా.. మా వాళ్ల‌కి ఒక ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ అవ‌స‌రం.. ద‌గ్గ‌రి బంధువులు అని చెప్పి.. వీళ్లే వెతికి మ‌రీ తెచ్చుకుని.. బ్లాక్ చేస్తున్నార‌ట‌. ఇలా కూడా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు బ్లాక్ అయ్యి ఉన్నాయ‌నే టాక్ న‌డుస్తోంది. కాక‌పోతే.. వీటిపై మాత్రం ఎవ‌రికీ క్లారిటీస్ లేవు.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   11 minutes ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   19 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle