కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-202118-01-2021 23:01:54 IST
Updated On 18-01-2021 17:59:17 ISTUpdated On 18-01-20212021-01-18T17:31:54.446Z18-01-2021 2021-01-18T11:28:19.129Z - 2021-01-18T12:29:17.512Z - 18-01-2021

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే..! యూరప్ దేశాల్లో మరణాల రేటు ఎంతో తీవ్రంగా ఉంది. ప్రపంచం మొత్తాన్ని ఫుట్ బాల్ ఆడేసుకున్న కరోనాను చాలా మంది తక్కువ చేసి చూశారు. ఏమవుతుందిలే అనుకుని లైట్ గా తీసుకున్న వారిని కూడా కరోనా కబళించివేసింది. ఇక చాలా దేశాలు పెద్దగా పరిశోధనలు చేయకుండానే వ్యాక్సినేషన్ విషయంలో ముందుకు వెళ్లాయంటే ఈ మహమ్మారి ఎంతగా భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ కరోనా వైరస్ కు సంబంధించిన పరిశోధనలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ పరిశోధనలు కాస్తా ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూ ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో బ్రిటన్ కు చెందిన లీసెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా ప్రభావం నుంచి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు 140 రోజుల్లోపే చనిపోతున్నారట. కరోనా బారినపడితే వారిలో దీర్ఘకాలంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలుసుకున్నారు. ముఖ్యంగా గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతింటోందని.. కరోనా నుంచి కోలుకున్న వారిలో మూడో వంతు మంది ఐదు నెలల్లోపే మళ్లీ ఆసుపత్రుల పాలవుతున్నట్టు తాజా రీసర్చ్ లో తెలుసుకున్నారు. లీసెస్టర్ షైర్ వర్సిటీ, ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టగా కరోనా తొలి దశ వ్యాప్తి సమయంలో 47,780 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవ్వగా.. వారిలో 29.4 శాతం మంది 140 రోజుల్లోనే మళ్లీ ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పుకొచ్చారు. ఇక 12.3 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని పరిశోధకులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నా గానీ, తర్వాత రోజుల్లో హృదయ సంబంధ సమస్యలతో పాటు డయాబెటిస్, దీర్ఘకాలిక కాలేయ, కిడ్నీ సమస్యల బారినపడుతున్నారని కనుగొన్నారు. లీసెస్టర్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కమలేశ్ కుంతీ (ప్రైమరీ కేర్ డయాబెటిస్, వాస్క్యులర్ మెడిసన్) మాట్లాడుతూ, ఇది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన కరోనా బాధితులపై నిర్వహించిన అతి పెద్ద అధ్యయనం అని.. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి ఆరోగ్యవంతుల్లా ఇంటికి వెళుతున్నా మళ్లీ ఆసుపత్రుల్లో చేరుతున్న కేసులు అధికంగా కనిపించాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుని 23 మంది మృతి

27 ఏళ్ల తర్వాత రేప్ కేసు.. ఆమె అవసరం అలాంటిది
08-03-2021

మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. అత్త చెప్పిన రీజన్ వింటే తిట్టిపోస్తారు
07-03-2021

తాళి కట్టే టైంలో పెళ్లి ఆపిన వధువు..రీజన్ కాస్త విడ్డూరమే
07-03-2021

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
06-03-2021

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
06-03-2021

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021
ఇంకా