పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ఉత్తరాది
14-01-202114-01-2021 16:18:00 IST
2021-01-14T10:48:00.179Z14-01-2021 2021-01-14T10:47:52.644Z - - 24-01-2021

ఉత్తర బారతదేశం, ఈశాన్య భారత్ ఇప్పుడు నిజంగానే వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేని విధంగా పడిపోవడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భీతిల్లిపోతున్నారు. శ్రీనగర్‌లో అయితే గత ఎనిమిదేళ్ల కాలంలో అత్యల్ప శాతానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కశ్మీర్లో కొన్ని చోట్ల పొగమంచు తీవ్రమవటంతో కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దేశరాజధాని ఢిల్లీ చలి గుప్పిట్లో ఇరుక్కుని గజగజలాడుతోంది. పశ్చిమ హిమాలయాల నుంచి దూసుకొస్తున్న మంచు తుఫాను కారణంగా రాజధానిలో ఉష్ణోగ్రతలు 3.2 సెల్సియస్ డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయింది. నగరంలో చాలా చోట్ల మంచు దట్టంగా పేరుకుపోవడంతో 50 మీటర్లు దాటి ఏవీ కనిపించకుండా పోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. కాగా రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 0.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనజీవితం స్తంభించిపోయినంత పనైంది. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు చలిపులి దెబ్బకు వణికిపోతున్నాయి. పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చలి తాండవిస్తోంది. రాజస్తాన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భోగి పండుగ అంటే ఏమిటి? ఉత్తరభారతం చలికి వణుకుతుండగా దక్షిణాదిలో తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాల నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల పిడుగులు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులో బుధవారం కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిశాయి. కశ్మీర్ లోయ తీవ్రమైన చలిగాలుల తాకిడికి గురవుతోంది. జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌లో గత ఎనిమిదేళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం శ్రీనగర్‌లో 7.8 సెల్సియల్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2012 తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. ఇకపోతే కశ్మీర్ లోయ మొత్తం మంచుతుఫాను బారిన పడింది. ఇక పంజాబ్, హర్యానాలు, హిమాచల్ ప్రదేశ్ కూడా చలిపులి బారిన పడి గజగజమంటున్నాయి.

గన్ గురిపెట్టి.. ముత్తూట్ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ
16 hours ago

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
22-01-2021

డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'
22-01-2021

మూడంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు..
21-01-2021

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
21-01-2021

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021
ఇంకా