newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

13-06-202113-06-2021 09:23:51 IST
2021-06-13T03:53:51.506Z13-06-2021 2021-06-13T03:51:50.998Z - - 25-07-2021

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఇండియాలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా కోరల్లో చిక్కుకుని ఎందరో బలయ్యారు. ఎన్నో కుటుంబాలు చిద్రం అయ్యాయి. కరోనా రక్కసి కోరల అంచుల వరకు వెళ్లి బయట పడ్డ వారు కూడా ఉన్నారు. కరోనాని జయించిన సంతోషం తో ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ప్రమాదం ముంచుకి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో కరోనా థర్డ్ వేవ్ కూడా రానుందని, దీని ప్రభావం చిన్న పిల్లలపై తీవ్రంగా ఉంటుందని, పిల్లల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడిపోతాయన్న వార్తలు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకి గురయ్యారు. అయితే కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ప్రకటించడంతో కాస్త ఊరట లభించినట్లయ్యింది. 

ఈ నివేదిక ని ఇచ్చిన లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ‘భారతీయ పిల్లల్లో కోవిడ్‌ 19’ అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్‌ ఇండియా సంస్థ ఎయిమ్స్‌లోని ప్రముఖ పీడియాట్రిషన్ల్ల(చిన్నపిల్లల వైద్య నిపుణులు)తో  కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం పిల్లలలో థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది. ‘కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో ఎక్కువమంది ఎలాంటి లక్షణాలను కనబరచరు(ఎసింప్టమాటిక్‌), మిగిలినవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో అధికులు స్వల్ప జ్వరం, శ్వాస సమస్యలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. వయసులవారీగా చూస్తే లక్షణాలు చూపే పిల్లల సంఖ్య వయసు పెరిగేకొద్దీ పెరుగుతుంది’అని బృంద నివేదిక తెలిపింది.  

గణాంకాల ప్రకారం చూస్తే కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువని కానీ, పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారనేందుకు కానీ సరైన ఆధారాలేవీ లేవని ఒబేసిటీ, ఆస్థమా, శ్వాస సమస్యలు, పెరుగుదల సమస్యలు, గుండె సమస్యలు, కాన్సర్, ఇమ్యునిటీ వ్యాధులు రిస్కు కారకాలని నివేదిక తెలిపింది. అలాగే తీవ్రత తక్కువని నిర్లక్ష్యం చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి మౌలిక వసతులు పెంచడం, ఆక్సీజన్‌ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవడం, మందుల కొరత నివారించడం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది.

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

   9 hours ago


Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

   20-07-2021


Hyderabad: 16 ఏళ్ల  కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

Hyderabad: 16 ఏళ్ల కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

   20-07-2021


16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

   19-07-2021


ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

   18-07-2021


ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

   17-07-2021


Prakasam: కన్న తండ్రే  15 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

Prakasam: కన్న తండ్రే 15 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

   15-07-2021


షెయిన్ భారతదేశంలో తిరిగి వస్తోంది.. భారతీయ ఫ్యాషన్‌ వాదుల రెడీ

షెయిన్ భారతదేశంలో తిరిగి వస్తోంది.. భారతీయ ఫ్యాషన్‌ వాదుల రెడీ

   15-07-2021


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతలాకుతలం అయిన భాగ్యనగరం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతలాకుతలం అయిన భాగ్యనగరం

   15-07-2021


7 ఏళ్ల కోయంబత్తూర్ బాలుడి స్పూఫ్ వీడియో వైరల్ అయ్యింది

7 ఏళ్ల కోయంబత్తూర్ బాలుడి స్పూఫ్ వీడియో వైరల్ అయ్యింది

   14-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle