newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

నెల్లూరు జిల్లా హై అలర్ట్.. మూడు రోజులు సెలవులు

25-11-202025-11-2020 09:20:32 IST
Updated On 25-11-2020 11:00:36 ISTUpdated On 25-11-20202020-11-25T03:50:32.009Z25-11-2020 2020-11-25T03:50:26.325Z - 2020-11-25T05:30:36.100Z - 25-11-2020

నెల్లూరు జిల్లా హై అలర్ట్.. మూడు రోజులు సెలవులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. నివారు తుపాను తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. నివర్ ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు.

7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. ఈ అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతవరణశాఖ అధికారులు తెలిపారు. నివర్ తుపాను కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. నేటి నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. 

నివర్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ఉంటుందని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. నివర్ తీరం దాటిన తర్వాత నెల్లూరుతో పాటు చిత్తూరు తదితర రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

గన్ గురిపెట్టి.. ముత్తూట్‌ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ

గన్ గురిపెట్టి.. ముత్తూట్‌ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ

   16 hours ago


హైద‌రాబాద్ బిర్యానీ తింటున్నారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

హైద‌రాబాద్ బిర్యానీ తింటున్నారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

   22-01-2021


డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'

డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'

   22-01-2021


మూడంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు..

మూడంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు..

   21-01-2021


పిడ‌క‌లు అమ్మ‌డం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్ర‌స్టింగ్

పిడ‌క‌లు అమ్మ‌డం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్ర‌స్టింగ్

   21-01-2021


మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!

   20-01-2021


అత్త‌కు గుడి కట్టిన కోడళ్ళు.. ప్ర‌తి నెలా భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు

అత్త‌కు గుడి కట్టిన కోడళ్ళు.. ప్ర‌తి నెలా భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు

   20-01-2021


కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!

   18-01-2021


అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..

   17-01-2021


ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి

   17-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle