ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్వ్యూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
18-01-202218-01-2022 08:13:32 IST
2022-01-18T02:43:32.276Z18-01-2022 2022-01-18T02:43:27.736Z - - 25-05-2022

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్వ్యూ విధించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో జనవరి 18వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరికోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది. అయితే ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని నిబంధనలు, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా