ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ
27-11-202027-11-2020 19:59:01 IST
Updated On 28-11-2020 08:23:32 ISTUpdated On 28-11-20202020-11-27T14:29:01.168Z27-11-2020 2020-11-27T14:28:56.690Z - 2020-11-28T02:53:32.448Z - 28-11-2020

నివర్ తుపాను కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకొన్ని గంటల్లో మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని మామళ్లపురం-కరెైకల్ మధ్య తీరం దాటిన నివర్ తుపాను ఏపీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం నివర్ పూర్తిగా బలహీనపడినట్టు తెలుస్తోంది. వాతావరణ శాఖ మాత్రం నివర్ తర్వాత మరో రెండు తుపానులు రాబోతున్నాయని హెచ్చరిస్తోంది. ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఇది బలపడి డిసెంబరు 2న తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని 'బురేవి' అని తుపానుగా నామకరణం చేసే అవకాశం ఉంది. ఇది తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుంది. మధ్య బంగాళాఖాతంలో డిసెంబరు 5న ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారితే దాన్ని 'టకేటి' అని పిలవచ్చు. టకేటి ప్రభావంతో డిసెంబరు 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏది ఏమైనా ఆంధ్రా లోని చాలా ప్రాంతాలు రాబోయే కాలంలో తడిసి ముద్దయ్యే అవకాశం ఉంది.

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
an hour ago

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021
ఇంకా