అల్లుడ్ని లేపుకెళ్లిన అత్త.. ఓ రొమాంటిక్ క్రైమ్ కథ
19-02-202119-02-2021 11:45:37 IST
Updated On 19-02-2021 11:04:44 ISTUpdated On 19-02-20212021-02-19T06:15:37.509Z19-02-2021 2021-02-19T04:41:34.916Z - 2021-02-19T05:34:44.254Z - 19-02-2021

ఏంటండీ ఈ వార్తలు.. నరాలు కట్ అయిపోయేలా ఉన్నయ్. ఏం చెబుతున్నారండీ.. సభ్య సమాజం ఏమై పోతుందండీ అని గుండెలు బాదేసుకుంటే ఏం చేయలేం. ఏం చేస్తాం చెప్పండి. ట్వంటీ ట్వంటీ ఎఫెక్ట్ అంటే ఇట్టాగే ఉంటుంది మరి. ఏదో అంటారు కదా.. ట్వంటీ ట్వంటీకి ముందు.. ట్వంటీ ట్వంటీకి తర్వాత అని. అట్టాంటిదే ఇది కూడా. అయినా ఇంతకు ముందు మాత్రం లేవా చెప్పండి. కాకపోతే.. ఇప్పుడు కూడా ఓ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. అయితే.. మన దగ్గర కాదులెండి. మనం కాస్త సంప్రదాయాలు గట్రా కాస్త ఎక్కువగా చూస్తాం కదా. అందుకే మన దగ్గర కాదు.. మన భారతీయులు అస్సలే కాదు. ఇంగ్లండోళ్లు కాస్త స్పీడ్ అనమాట. ఈ అత్తగారు అయితే మరికాస్త స్పీడ్ అట. అంతే ఇక.. మరి కతేంటి అంటే. లేటు వయసులో ఘాటు ప్రేమ. ఇక ఆ ప్రేమకీ హద్దులు బొద్దులు ఉంటాయా చెప్పండి. ఏం లేవు. జార్జినా అనే ఇంగ్లండ్ లేడీ వయసు 44 ఏళ్లు. మొగుడు కూడా సూపర్ యాక్టివ్ అట. హ్యాప్పీగా లైఫ్ నడుస్తూ ఉంది. పిల్లలు.. వాళ్లకి పెళ్లిళ్లు.. వాళ్లకి కూడా పిల్లలు ఉన్నారు. అత్త కాస్త అమ్మమ్మ అయింది. అయితే.. ఓ కూతురికి రెండో ప్రగ్నెన్సీ వచ్చిందంట. మరి కూతురు ఇబ్బంది పడుతుందంట.. భర్త చూసుకోలేక పోతున్నాడట. ఇక అక్కడేం ఉంటారులే.. ఇంటికి రండి నేను చూస్కుంటా అందంట తల్లి. హమ్మయ్య రెండో కాన్పు కూడా మా అమ్మే చూసుకుంటా అంటోంది అని.. కూతురు ఆనందంగా వచ్చిందంట. ఆమెకు తెలీదు.. తన తల్లి చూసుకునేది తనని కాదు.. తన మొగుడ్ని అని. ఇక కూతుర్ని ఇంట్లో ఉంచకుండా హాస్పిటల్ లో ఉంచారట. ఇంట్లోనేమో.. అత్తా అల్లుల్లు కామా తురాణం.. నభయం.. నలజ్జ అనే సామెతని వల్లెవేస్తున్నారట. ప్రపంచంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎన్నిలక్షల మందో తెలుసా ఇక ఇంట్లో పిల్లలు.. వాళ్లాయన ఉంటారు కదా. ఇక ఇబ్బంది అవుతుందని.. ఎంచక్కా చెక్కేశారట. అత్తా అల్లుల్ల ఘాటు ప్రేమ అంత దాకా తీసుకొచ్చింది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేక.. జంప్ అయ్యారు. ఫైనల్ గా కూతురి డెలివరీ అయింది. ఆ టైంలో.. అమ్మా, మొగుళ్లు లేకుంటే.. ఆ కూతురుకి డౌట్ కూడా వచ్చిందంట. మిగతా వాళ్లు ఏవేవో చెప్పి కవర్ చేశారట. ఫైనల్ గా ఇంటికొచ్చాక చూస్తే ఏముంది.. జరగాల్సింది అంతా జరిగిపోయింది అని తెలిసిపోయింది. ఆ అత్తా అల్లుల్ల ఘాటు ప్రేమతో.. ఆమె కన్న కూతురికి మొగుడు దూరం అయ్యాడు. ఆమెను కట్టుకున్న మొగుడికి పెళ్లాం కరువైంది. వీళ్లు మాత్రం అడ్రస్ లేకుండా జంప్ అయ్యారు. అదండీ ప్రేమ కత.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.
25-02-2021

అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. అయినా జనం ఏంటి ఇలా
25-02-2021

Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
24-02-2021

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్
23-02-2021

మూడేళ్ల తర్వాత వచ్చిన భర్త.. భార్యకి ఐదునెలల గర్భం
23-02-2021

ప్రతి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం
23-02-2021

కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ
22-02-2021

గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..
20-02-2021

ట్రాన్స్ జెండర్లతో ప్రాబ్లమా.. ఈ నెంబర్ కి కాల్ కొట్టండి- సీపీ సజ్జనార్
20-02-2021

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా
19-02-2021
ఇంకా