newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కిరీటం లాగేసింది... ర‌చ్చ ర‌చ్చ చేసింది

08-04-202108-04-2021 09:54:31 IST
Updated On 08-04-2021 09:56:11 ISTUpdated On 08-04-20212021-04-08T04:24:31.815Z08-04-2021 2021-04-07T18:36:15.224Z - 2021-04-08T04:26:11.217Z - 08-04-2021

కిరీటం లాగేసింది... ర‌చ్చ ర‌చ్చ చేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అందాల పోటీలు అంటే మామూలు మాట‌లా చెప్పండి. ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తారో క‌దా. నోరు క‌ట్టుకుని బ‌తుకుతారు. ఎన్నో ర‌కాల ఎక్సర్ సైజ్ లు చేస్తారు. క్యాట్ వాక్ లు గ‌ట్రా ఎన్నుంట‌యో.. అంద‌రికీ ఓ మోస్త‌రుగా ఐడియా అయితే ఉంది. అందం ఉండాలి.. అభిన‌యం ఉండాలి.. తెలివి తేట‌లు కూడా ఉండాలి. లేదంటే క‌ష్ట‌మే. ఎంతో మందికి అది క‌ల‌ల కిరీటం.. ఒక్క‌సారి కిరీటం ద‌క్కితే లైఫ్ మారిపోతుంది. ఒక్క‌సారిగా త‌ల‌పైకి కిరీటం వ‌చ్చిన‌ట్లే స్టార్ డ‌మ్ కూడా వ‌స్తుంది. కానీ.. గ‌ద్దొచ్చి కోడిపిల్ల‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు.. స‌డ‌న్ గా కిరీటాన్ని లాగేసుకుంటే ఏం చేయాలి. త‌న క‌ల‌ల కిరీటాన్ని.. ఎత్తుకెళ్లి ఇంకొక‌రి నెత్తిమీద పెడితే ఏం చేయాలి. పాపం క‌దా.. మిసెస్ శ్రీలంక పొజిష‌న్ అదే.. అస‌లు ఏం జ‌రిగిందో.. తెలుసా.

సింపుల్ గా చెప్పుకుంటే.. పుష్పిక అనే మ్యారీడ్ ఉమెన్ కి.. మిసెస్ శ్రీలంక కిరీటం ద‌క్కింది. అన్ని ర‌కాల పోటీలు అయిపోయిన త‌ర్వాత ఆమెను విన్న‌ర్ గా ప్ర‌క‌టించారు. పుష్పికకు మిసెస్ శ్రీలంక కిరీటాన్ని.. మిసెస్ వ‌ర‌ల్డ్ అయిన క‌రోలీనా చేత ఇప్పించారు. మిసెస్ వ‌ర‌ల్డ్ క‌రోలీనా.. మిసెస్ శ్రీలంక అయిన పుష్పిక‌కు కిరీటం పెట్టింది. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. స‌డ‌న్ గా క‌రోలీనాకి ఏమైందో ఏమో తెలియ‌దు.. అంద‌రి ముందు ఓ విష‌యం చెప్పింది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్న‌య్. మిసెస్ శ్రీలంక కిరీటం ద‌క్కాలి అంటే.. విడాకులు తీసుకోకూడ‌దు.. మిసెస్ గానే ఉండాలి. విడాకులు తీసుకున్న పుష్పిక‌కు.. మిసెస్ శ్రీలంక కిరీటం ద‌క్కించుకునే అర్హ‌త లేదు అంటూ.. త‌నే పుష్పిక త‌ల‌పై పెట్టిన మిసెస్ శ్రీలంక కిరీటాన్ని.. తీసుకెళ్లి ర‌న్న‌ర‌ఫ్ త‌ల‌పై పెట్టింది. కిరీటం లాగేసే టైంలో.. పుష్పిక‌కు గాయాలు కూడా అయ్యాయి. అయినా స‌రే.. క‌రోలీనా మాత్రం త‌గ్గ‌లేదు. నెత్తిపై ఉన్న క‌ల‌ల కిరీటాన్ని లాగేసి.. ర‌న్న‌ర‌ఫ్ నెత్తిపై పెట్టింది.

అంద‌రూ షాక్ అయ్యారు. పాపం అవ‌మానంగా ఫీలైన మిసెస్ శ్రీలంక పుష్పిక స్టేజీ వెనుక నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. వెంట‌నే త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై లీగ‌ల్ కూడా మూవ్ అయింది. అంతే కాదు.. నేను విడాకులు తీసుకున్న విష‌యాన్ని ప్రూవ్ చేయాలి అంటూ.. క‌రోలీనాకి స‌వాల్ విసిరింది పుష్పిక‌. అయితే.. మిసెస్ శ్రీలంక నిర్వాహ‌కులు మాత్రం.. పుష్పిక‌ను మ‌ళ్లీ పిలిచి.. జ‌రిగిన షాకింగ్ ఘ‌ట‌న‌కి సారీ చెప్పి.. మ‌ళ్లీ మిసెస్ శ్రీలంక కిరీటాన్ని.. పుష్పిక‌కే అంద‌జేశారు. మ‌రి ఇప్పుడు కిరీటం లాగేసి.. మిసెస్ వ‌ర‌ల్డ్ క‌రోలీనా ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. అందాల పోటీల్లో జ‌రిగిన ఈ షాకింగ్ సీన్.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇంట్ర‌స్టింగ్ గా మారింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle