newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

భాగ్యనగరంలో మిడ్ నైట్ దోశ.. కేరాఫ్ అడ్రస్ రామ్ కీ బండి..!

12-01-202112-01-2021 00:31:20 IST
2021-01-11T19:01:20.932Z12-01-2021 2021-01-11T19:00:59.294Z - - 17-01-2021

భాగ్యనగరంలో మిడ్ నైట్ దోశ.. కేరాఫ్ అడ్రస్ రామ్ కీ బండి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రామ్ కీ బండి.. ఎంత స్పెషల్ అంటే ఎవరైనా హైదరాబాద్ వస్తే ఒక్కసారి తప్పకుండా ఈ బండి దగ్గర దోశ తినాలని అనుకోవడం కామన్. ఎవరైనా హైదరాబాద్ నగరంలో కాలు మోపగానే.. రాత్రంతా ఒక రౌండ్ వేయాలని.. ట్యాంక్ బండ్.. నక్లెస్ రోడ్.. చార్మినార్ ఇలా కొన్ని ప్రదేశాలు చూడాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. అలా అలా ఒక సెకండ్ షో సినిమా చూసేసి.. హైదరాబాద్ అంతా ఒక షికారు వేస్తే వచ్చే మజా అదనం. అలా నైట్ అంతా షికారు చేసి అలసిన వాళ్ళకి.. ఫుడ్ లవర్స్ కి.. నైట్ డ్యూటీ చేసి వెళ్తూ వెళ్తూ తినేసి పడుకుందాం అనే వాళ్ళకి ఓ సూపర్ టేస్టీ టిఫిన్స్ ను అందించడం ఒక రామ్ కీ బండికి మాత్రమే సాధ్యం. 

హైదరాబాద్ నగరంలో గల్లీకి నాలుగైదు టిఫిన్ సెంటర్స్ ఉన్నా.. రాత్రి సమయంలో టిఫిన్ అందించే బండ్లు ఉన్నా..కుర్రాళ్ళ నుండి వృద్ధుల వరకు నైట్ టిఫిన్ అంటే ఫస్ట్ ఆప్షన్ రామ్ కీ బండి. అంతగా ఈ టిఫిన్ సెంటర్ అట్రాక్ట్ చేసేస్తుంది. అయితే.. ఇక్కడ తినాలి అంటే మాత్రం మినిమం ఉదయం 3 గంటలు కావాలి. అప్పటి వరకు అక్కడ గప్ చుప్ గా ఉన్న వాతావరణం రామ్ కి బండి ఓపెన్ చేయగానే ఆ ప్రాంతం సందడిగా మారిపోతుంది. ముందుగా ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ లో ఏం ఐటెం కావాలో టోకెన్స్ తీసుకోవడం దగ్గర నుండి సందడి మొదలవగా.. ఒక్కొక్కరిగా తమ ఆర్డర్లను తీసుకుంటూ.. లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే ఒక్కటి తిందాం అనుకుని వచ్చిన వాళ్ళు మరొకటి లగించేసి వెళ్ళడం ఖాయం. అర్ధరాత్రి టిఫిన్స్ అంటే ఈ రామ్ కీ బండి ఒక బ్రాండ్ కాగా.. హైదరాబాద్ లోని బెస్ట్ దోశ ఇక్కడ దొరకడం విశేషం.

ఇక ఈ సెంటర్ చరిత్ర తెలుసుకుంటే.. అర్ధరాత్రి సమయంలో తినాలి అనుకునే వాళ్ళ కోసమే 1989లో ఈ రామ్ కీ బండి వెలియగా రామ్ భాయ్ అని పిలుచుకునే రామ్ షిండే ఈ సెంటర్ కు తొలుత శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత టేస్ట్ నగర వాసులకు తెగ నచ్చేయడం, అది కూడా వెజిటేరియన్ కావడంతో సిటీలో ఇదో ఫేమస్ అయిపోయింది. పగలంతా మొజంజాహీ మార్కెట్ ఈ ఏరియాకి ఫేమస్ అయితే.. రాత్రికి రామ్ కీ బండి ఆ ఏరియాకి కళ తెచ్చిపెడుతుంది. ఒక దక్షిణ భారత వంటకాల్లో.. అదీ దోశలో ఇన్ని వెరైటీలు ఉంటాయా అన్నది రామ్ కీ బండి దగ్గరకు వెళ్తేనే అర్థం అవుతుంది. ఉదయం 3 నుండి 8 గంటల వరకూ మాత్రమే కనిపించే ఈ టిఫిన్ సెంటర్.. కొన్ని కొన్ని సార్లు వాళ్లు తెచ్చుకున్న ఫుడ్ ఐటెమ్స్ కు సంబంధించిన వస్తువులన్నీ అయిపోతే ఇంకా ముందే మూతపడినా ఆశ్చర్యం లేదు.

ప్లెయిన్ దోశ దగ్గర నుండి.. షెజ్వాన్ దోశ వరకూ ఇక్కడ వెరైటీలకు కొదువే లేకపోగా.. ముఖ్యంగా ఇక్కడ దొరికే పిజ్జా దోశకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక దూదిలాగా ఉండే ఇడ్లీ మెత్తగా గొంతులోకి వెళ్ళిపోతుంటే ఆ ఆనందమే వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే అర్ధరాత్రి వేళ.. హాయిగా మనసుకి నచ్చినట్లు తినాలనుకుంటే లేట్ చేయకుండా రామ్ కీ బండి వద్దకు దారి వెతుక్కొడమే. పనిలో పనిగా అలా అలా అర్థరాత్రి వేళ నగర అందాలను ఓ లుక్కేసుకుంటూ ఎంచక్కా కడపునింపుకొని రావచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ అన్ని రకాల బ్యాంకుల కార్డులు, డిజిటల్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుండడంతో జేబులో పైసలేసుకోవాల్సిన పనికూడా లేదు. సోషల్ మీడియాలో కూడా రామ్ కీ బండికి మంచి పేరే ఉండడం.. ఒకసారి వెళ్లిన వాళ్ళు చేసే మౌత్ పబ్లిసిటీ నగరంలో ఇప్పుడు ఇదొక బ్రాండ్ గా మారిపోయింది. ఈ టిఫిన్ సెంటర్ గురించి ఏమైనా చెప్పాలి అంటే.. హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్లి టెస్ట్ చేయొచ్చు.. అదే హైదరాబాద్ కి రావాలి అని అనుకునే వారు వాళ్ళ.. విష్ లిస్ట్ లోకి రామ్ కీ బండిని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ బండి తెలిసిన వాళ్లైతే మళ్లీ నోరూరాడం ఖాయం కనుక ఇంకెందుకు ఆలస్యం చలో మోజంజాహీ మార్కెట్ ఏరియా...


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle