newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

26-09-202026-09-2020 09:28:13 IST
2020-09-26T03:58:13.477Z26-09-2020 2020-09-26T03:58:06.946Z - - 20-10-2020

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయ వివాహ వ్యవస్థలో మాంగల్య ధారణ కాగానే వరుడి కాళ్లకు వధువు దండం పెడుతుంది. పెళ్లైన వెంటనే తన ఇంటి పేరును మార్చుకుంటుంది. మరి రివర్స్‌లో జరగదు ఎందుకు. పెళ్లి కుమారుడు అంటే శ్రీ మహా విష్ణువు అంటారు.. మరి భార్య అంటే లక్ష్మీ దేవినే కదా. కాళ్లు కడిగితే తప్పేంటి.. పాదాలకు ఎందుకు నమస్కరించకూడదు. ఆడపిల్లకు తొలుత పుట్టింటి నుంచే ఓ గుర్తింపు వస్తుంది.. మరి అలాంటప్పుడు దాన్ని మార్చుకోవడం ఎందుకు. 

ఈ ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం లభించింది. భారతీయ యువతిని ప్రేమించి.. మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని.. ఏళ్లుగా ఆడ పిల్లలు మాత్రమే పాటిస్తున్న సంప్రదాయాలను తాను పాటించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ప్రత్యేక కథనాన్ని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ప్రచురించింది.

వివరాల్లోకి పోతే.. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల నిమిత్తం ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్‌ బుల్లర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు విద్యార్థి నాయకుడు. మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇద్దరి మనసులో మాత్రం ఒకరికోసం ఒకరం అనే భావన కలిగింది. అయితే వారి పరిచయం ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఒలేగ్‌కి అది లాస్ట్‌ అకడామిక్‌ ఇయర్‌. దీపా యూనివర్సిటీలో చేరిన 6 నెలలకే అతడు క్యాంపస్‌ నుంచి వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా కేవలం పుట్టిన రోజు నాడు మాత్రమే మెసేజ్‌లు చేసుకునే వారు. 

ఇలా ఓ పుట్టిన రోజు నాడు ఆమ్‌స్టర్‌డామ్‌లో డిన్నర్‌కి మీట్‌ అవుదామని అడిగాడు ఒలేగ్‌. అప్పుడు దీప లండన్‌లో ఉంది. దాంతో ఆరు నెలల తర్వాత డిన్నర్‌కి కలిశారు. ఆ తర్వాత స్కైప్‌లో మాట్లాడుకునే వారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దీపకు ఓగ్‌ నుంచి డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగింది. దీప ఒక్కతే వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు అనుకోని సర్‌ప్రైజ్‌ ఎదురయ్యింది. అక్కడ ఒలేగ్‌ ఉన్నాడు. పైగా అతడి చేతిలో ఉంగరం. దీప రాగానే మోకాలి మీద నిలబడి పెళ్లి చేసుకోమని కోరాడు ఒలేగ్‌. ఆనందభాష్పాల మధ్య దీప ఎస్‌ చెప్పింది. 

ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆమోదంతో వీరి వివాహం నిశ్చయమయ్యింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘మా వివాహం యూరోపియన్‌, భారతీయ సంస్కృతుల సంపూర్ణ కలయికగా నిలిచింది. ఇక వివాహ తంతులో నన్ను ఒలేగ్‌ పాదాలకు నమస్కరించమని చెప్పారు. అప్పుడు ఇద్దరం కేవలం ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి అని ప్రశ్నించాము. వెంటనే ఒలేగ్‌ నా పాదాలను తాకాడు. అంతేకాదు మేం ఒకరి ఇంటి పేరు ఒకరం మార్చుకున్నాం.  నేను దీప బుల్లర్‌ ఖోస్లా... తను ఒలేగ్‌ బుల్లర్‌ ఖోస్లా. చాలా గర్వంగా ఉంది’ అన్నారు దీప. 

ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్‌ చాలా మందికి నచ్చింది. ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ పురుషులు ఇన్నాళ్లుగా చేయలేని పని ఒక విదేశీయుడు చేసి తన హిందూ భార్య పాదాలకు నమస్కరించడం ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని ఆశిద్దాం.

Meet Cute In Amsterdam, Proposal In Udaipur. Then, Shaadi With A Twist


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle