newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

టెన్షన్ పెడుతున్న పెళ్లి ముహూర్తాలు.. మళ్లీ ముహూర్తాలు ఎప్పుడంటే

09-01-202109-01-2021 11:44:14 IST
2021-01-09T06:14:14.681Z09-01-2021 2021-01-09T06:14:08.864Z - - 17-01-2021

టెన్షన్ పెడుతున్న పెళ్లి ముహూర్తాలు.. మళ్లీ ముహూర్తాలు ఎప్పుడంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 2020లో పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకున్న జంటలకు కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన లాక్ డౌన్ చాలా ఇబ్బందులు పెట్టింది. లాక్ డౌన్ లో కూడా కొందరు పెళ్లిళ్లు నిర్వహించారు. తక్కువ మందితో, ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చుకుంటూ.. అలా పెళ్ళిళ్ళను కానిచ్చేశారు. ఇక 2021 వచ్చేసింది. ఇక ఈ ఏడాది కరోనా టెన్షన్ తక్కువగా ఉంటుంది పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనుకున్న వాళ్లకు ముహూర్తాలు లేకుండా పోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయట.  గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు అడ్డంకి అవు తోందని, దీంతో శుక్రవారం వరకే పెళ్లి ముహూర్తాలు ముగిశాయని చెబుతూ ఉన్నారు.  ఇక ఈ ఏడాది మే నెల వరకూ మంచి రోజులు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు.  

జనవరి 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు.. శూన్య మాసంలో హిందువులు పెళ్లిళ్లు చేసుకోరు. ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ 80 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఆ తర్వాత శుభదినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు బలమైన ముహూర్తాల్లేక పోవడంతో మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి. కానీ అవి కూడా చాలా కొద్ది రోజులు మాత్రమేనని అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావు. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదు.. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజులలో పెళ్లిళ్లకి మంచి రోజులు కావట. గతేడాదంతా కరోనా సమస్యలతో శుభకార్యాలు తక్కువగా జరిగగా.. ఈ ఏడాది ముహూర్తాలు లేకపోవడం నిరాశ కలిగించే అంశమే..!   ఈ ఏడాది తెలుగు మాసాల్లో ఒక మాసం అధికంగా వచ్చింది. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు చేయరని.. నిజ మాసంలో..అది కూడా బలమైన ముహూర్తం ఉంటేనే శుభకార్యాలు నిర్వహస్తారని పండితులు చెబుతూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle