newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

మనసున మనసై... పాటకు ప్రాణమై : నేడు ఆత్రేయ శతజయంతి

07-05-202107-05-2021 16:34:20 IST
2021-05-07T11:04:20.207Z07-05-2021 2021-05-07T11:04:18.478Z - - 14-06-2021

మనసున మనసై... పాటకు ప్రాణమై : నేడు ఆత్రేయ శతజయంతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు పాటకు మనసునద్దిన మాహాకవి. పాటను మనసు లోగిళ్ల లోకితీసుకెళ్లిన సాహితీ సవ్యసాచి ఆచార్య ఆత్రేయ. తెలుగు రంగస్థల మార్తాండుడిగా తన అద్వితీయ ప్రతిభను కనవరచిన ఆత్రేయ సినిమా రంగాన్నీ పాటల మాధుర్యంతో మాటల మమకారంతో లాలించి నడిపించారు. ఈ మహాకవి శత జయంతి సందర్బంగా ఆయన పాటల పూదోటలో విహరిద్దాం. మనసులోని మమతానురాగాలను ఆస్వాదిద్దాం. యాభయ్యవ దశకం తొలినాళ్లలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆచార్య ఆత్రేయ స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. అయన  సిరానుంచి మమతల మాగాణి పండింది. ఆయన కలం నుంచి ఉత్తుంగ తరంగంలా తెలుగు భాష ఉవ్వెత్తున ఎగసింది. పాటైనా, మాటైనా ఆత్రేయ ముద్ర పడితే అది అజరామరమే అవుతుందని చెప్పడానికి దృష్టాంతాలు ఎన్నో. తెలుగు సినీ సంభాషణలను సామాన్యుడి నోట పలికించి భళా అనిపించుకున్న జనరంజక కవి ఆత్రేయ. 1921 మే 7న నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో జన్మించిన ఆత్రేయ అసలు పేరు కిలాంబి వెంకట నరసింహా చార్యులు. ఇటు గోత్రాన్ని అటు పేరును కలిపి ఆచార్య ఆత్రేయ అనే కల నామంతో తెలుగు కళామతల్లి నొసటన మాటల కుంకుమ దిద్దారు. తన అద్భుత అనిర్వచనీయ భావాల హారాన్నే ఆమె కంఠాభరణం చేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆచార్య ఆత్రేయ పాటలేని సినిమా లేదంటే ఆయన రాసిన మాటలను పలకని నటీనటులు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. మాటంటే  జనం మాట్లాడుకునేదే  కావాలి. పాటంటే వారి నోట పలికేదే కావాలి అన్న స్పృహతోనే ఆయన రాణించారు. తెలుగు సినీ జగత్తును శాసించారు. మామూలు పదాలతో ఎంతటి బలమైన భావాన్నయినా గుండెలకు అద్దుకునేలా చేయగలిగే నిరుపమాన సాహితీ శైలి ఆత్రేయది. ఏ రకమైన సందర్భానికైనా ఎలాంటి భావానికైనా ఆయన పాటలు సరికొత్త అందాన్నే తెచ్చాయి.

On 'Kaarulo shikaarukelle' and its relaxation tones - The Hindu

మానవ భావోద్వేగాలు అన్నింటిని తన పాటల పూదోటలో ఆయన విహరింపజేశారు. మనసు ద్వారాలు తెరచి  అందులోని ఉద్వేగాలను ఆనందానురాగా లను మైమరపించే మానవీయ భావాలను ఆవిష్కరించారు. ఇందుకు ఆయన ఎంచుకున్నది ఘనమైన, బలమైన పదాలేమీ కాదు. సామాన్య పదాలతో అసామాన్య భావ ప్రకంపనలు సృష్టించగలిగిన సాహితీ మేటి ఆత్రేయ. మనిషిని కదిలించేది మనసు. కలవరపెట్టేది మనసే "మౌనమె నీ భాష ఓ మూగ మనసా" అంటూ మనసు మనిషిని పెట్టే కలవరపాటును అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే శారీరకంగా ఎన్ని బాధలైనా  మనిషి తట్టుకోవచ్చు గానీ మనసు గాయపడితే అది ఆరేది చితిలోనేనంటూ ఓ పాటలో ఏకంగా సిద్ధాంతీకరించారు. గుండె పగిలినా, హృదయం రగిలినా ఆయన కలం నుంచే మనసు పడే వేదన తన్నుకొస్తుంది. అది పడే ఆరాటం కళ్ళకు కడుతుంది. నేడు శతజయంతిని జరుపుకుంటున్న ఆత్రేయ సినీ రంగాన్ని, అటు సాహితీ రంగాన్ని తనదైన  శైలిలో ప్రభావితం చేశారు. పాటకు పల్లవి ప్రాణం అన్నట్టుగా భావయుక్తమైన మామూలు మాటలే సినిమాకు జీవం. ఇలాంటి అద్భుతమైన, అనన్యమైన సినీ మాటలెన్నింటికో ఆత్రేయ చిరునామా. అటు మూగమనసులైనా, ఇటు మంచి మనసులైనా ఆయన పాటలు,  మాటలు జన హృదయ సాక్షాత్కారాలే. ఎవరు అందుకోలేనన్ని సాహితీ శిఖరాలను అధిష్టించిన ఆత్రేయ కలం బలం సమకాలీన సామాజిక జీవనానికి నిలువుటద్దంగా నిలిచింది. ఇటు పామరులను, అటు పండితులను ఏకకాలంలో అలరించగలిగిన  నవరస రచనా శైలి ఆత్రేయది. ఆయన పాటలన్నీ  భావ సముద్రాలే. అద్భుతమైన మణిమాణిక్యాలను తమలో ఇముడ్చుకున్న భావ సంద్రాలే. ఆయన పాటలో బాధ ఉంది. ప్రేమ ఉంది. ఆశా ఉంది. నిరాశా ఉంది. వీటన్నింటి లోతుల్లోకి ఆయన వెళ్లారు. పద సవ్యసాచిగా భావ సముద్రుడిగా జన హృదయాలను అలరించారు. యాభై, అరవై, డెబ్భై ఈ మూడు దశాబ్దాలు ఆత్రేయ శకాలుగా సినీ స్వర్ణ యుగాలుగా భాసిల్లుతున్నాయంటే అందుకు ఆయన పాటల సంతకం, మాటల పుస్తకమే కారణం. ఆత్రేయ మరణించి మూడు దశాబ్దాలు దాటినా ఆయన మాట మనను పలకరిస్తూనే ఉంటుంది. ప్రతి పాటా అలరిస్తూనే ఉంటుంది. పాటకు,  మాటకు ఆత్రేయ వేసిన మనసు బంధం మానవ జీవన భావోద్వేగాలకు అనునిత్య అనుబంధం.   

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   an hour ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   20 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle