newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

కోతులను తరమాలని అనుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ప్రాణాలనే పోగొట్టుకున్నాడు

31-12-202031-12-2020 20:22:03 IST
Updated On 01-01-2021 10:24:38 ISTUpdated On 01-01-20212020-12-31T14:52:03.545Z31-12-2020 2020-12-31T14:51:53.262Z - 2021-01-01T04:54:38.793Z - 01-01-2021

కోతులను తరమాలని అనుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ప్రాణాలనే పోగొట్టుకున్నాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా కోతులు చేసే పనులు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి ఉండే చెట్లను మనుషులు కొట్టేస్తూ వెళుతూ ఉండడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి వాటిది. అందుకనే ఇళ్లల్లోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి దొరికిన వస్తువులను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి తినడానికి పనికి వస్తాయో కూడా తెలియదు వాటికి..! ఇక ఇలా కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని తరమడానికి ఎప్పుడూ ఓ కట్టెను పక్కనే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అవి వస్తున్నాయో లేదో చూసి.. అరుస్తూ తరిమేస్తూ ఉంటారు. కోతుల బెడద ఉన్న చాలా ప్రాంతాల్లో ఎప్పుడూ జరిగే విషయాలే ఇవి. అలా కోతులను తరమడానికి వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చివరికి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. 

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కోతిని బెదరగొట్టేందుకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. కూకట్‌పల్లి జయనగర్‌ లో నివాసం ఉంటున్న లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ విధించిన సమయం నుంచి ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించాడు. కోతులు ఇంట్లోకి ప్రవేశించకుండా వాటిని బెదరగొట్టడానికి గాను చేతికి దొరికిన ఇనుప రాడ్డుతో వాటి మీదకు వెళ్ళాడు.

అక్కడి నుంచి తరిమేయడం మొదలుపెట్టాడు. అలా తరుముతూ తరుముతూ.. లోకేశ్ తన చేతిలో ఉన్న ఇనుపరాడ్ ను‌ ప్రమాదవశాత్తు రోడ్డు మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలేలా చేశాడు. అవతలి వైపు కరెంట్ వైర్లు.. ఇవతలి వైపు అతడి చేతిలో ఉన్న ఇనుప రాడ్.. కరెంట్ ప్రవహించి అతడికి ఒక్కసారిగా షాక్ కొట్టింది. షాక్ కొట్టగానే ఒక్కసారిగా లోకేశ్ కింద పడిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే లోకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కోతులను తరమాలని అనుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలను కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.   


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle