మామిడి కాయలు కోశారని తాళ్లతో కట్టేసి, పెంట నోట్లో కుక్కి.. అమానుష ఘటన
02-04-202102-04-2021 10:11:38 IST
Updated On 02-04-2021 11:08:51 ISTUpdated On 02-04-20212021-04-02T04:41:38.993Z02-04-2021 2021-04-02T04:41:24.026Z - 2021-04-02T05:38:51.832Z - 02-04-2021

మనిషికి మానవత్వం అన్నది ఏ కోశాన కూడా లేనప్పుడు ఎన్నో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పిల్లలు మామిడి కాయల కోసం అప్పుడప్పుడు తోపుల్లోకి వెళ్లడం.. అక్కడి కాపలాదారులకు దొరికిపోతూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వారిని మందలించడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటూ ఘటనలు చూసినప్పుడు.. వారివి అంత రాతి గుండెలా అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మామిడి కాయల దొంగతనానికి వచ్చారని.. పిల్లలను చిత్ర హింసలకు గురి చేశారు. ఇద్దరు పిల్లలను తోట కాపలాదారులు చిత్ర హింసలకు గురి చేశారు. పిల్లలను తాడుతో కట్టేసి చితకబాదారు. వారి నోట్లో ఆవు పేడ కుక్కి వారికి నరకం చూపించారు. పైగా ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. ఆ పిల్లలు కేకలు వేస్తూ.. వదిలేయండి.. వదిలేయండి అంటూ ఏడుస్తున్నా కూడా వినిపించుకోలేదు. ఆఖరికి పెంట తింటే వదిలేస్తామని వాళ్ళు చెప్పడంతో తినడానికి కూడా సిద్ధమయ్యారు ఆ పిల్లలు. తాతా వదిలెయ్ అని అరిచినా కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. వీడియోను రికార్డు చేస్తున్నాం.. మా వాళ్లకు పంపిస్తున్నామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. అలా ఈ వీడియో సోషల్ మీడియాకెక్కింది. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఇద్దరి వయసు 20 ఏళ్లు కూడా నిండలేదు.. ఫేస్ బుక్ ప్రేమ చివరికి..! ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కంటేపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. బేడబుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పిల్లలు మామిడి తోటలు మామిడి కాయలు కోశారు. బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారులుగా ఉంటున్నారు. అది గమనించిన తోట కాపరులు.. వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిద్దరి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి కర్రతో విపరీతంగా కొట్టారు. వారిని చిత్రహింసలకు గురి చేస్తూ తోట కాపరులు నవ్వుకుంటూ వీడియోను తీస్తూ వచ్చారు. క్షమించమని, వదిలేయండి అంటూ ఆ పిల్లలు ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. ఇంతలో ఓ వ్యక్తి ఆవు పేడను తీసుకువచ్చి వారి నోట్లో కుక్కాడు. ఆవు పేడను నోట్లో కుక్కి, వారి మీద నీటిని పోసి దారుణంగా ప్రవర్తించారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు తోట కాపలాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు

ఎండలు చల్లార్చే వానా.. బతుకులు తెల్లార్చే వానా
10 hours ago

విశాఖ జిల్లాలో దారుణ ఘటనలు..!
18 hours ago

37 రోజుల్లో ఒకే అమ్మాయితో 3 విడాకులు..4 పెళ్లిళ్లు, 5వ పెళ్లికి ట్విస్ట్
a day ago

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
a day ago

గోదావరిలో మనుషుల్ని తినే చేపలు
15-04-2021

కాటి కాపరికి 9 మంది భార్యలు.. ఆస్తి కోసం కాపరిపై హత్యాయత్నం
14-04-2021

తెలంగాణకు వర్ష సూచన.. తడిసిన హైదరాబాద్
14-04-2021

నాలుగు రోజుల పాటు వర్షాలు
13-04-2021

ప్లవ నామ సంవత్సరం.. మీ రాశి బలం
13-04-2021

భార్యని ప్రగ్నెంట్ చేసినందుకు భర్తకి జైలు శిక్ష
12-04-2021
ఇంకా