newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గోదావ‌రిలో మ‌నుషుల్ని తినే చేప‌లు

15-04-202115-04-2021 08:28:11 IST
2021-04-15T02:58:11.033Z15-04-2021 2021-04-15T02:57:45.714Z - - 15-05-2021

గోదావ‌రిలో మ‌నుషుల్ని తినే చేప‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రోజూ ఇన్ని కోట్ల చేప‌ల్ని తింటే ఏం ప్రాబ్ల‌మ్ లేదు. కానీ.. ఒక్క చేప‌కానీ.. మ‌నుషుల్ని తింటే సినిమాలు తీసేస్తారు జ‌నాలు. ఇది మ‌నం సినిమాల్లో వినే డైలాగ్. నిజ‌మే.. మ‌నుషుల్ని చేప‌లు తింటే సినిమాలు తీయ‌డం కామ‌నే. వాటిపై ఆల్రెడీ మూవీస్ వ‌చ్చాయి కూడా. కానీ.. అది మ‌నం ఊహ‌గా మాత్ర‌మే  అనుకున్నాం. లేదంటే.. ఎక్క‌డో వేరే దేశాల్లో ఉండేవి కావ‌చ్చు అనుకున్నాం. కానీ.. ఇప్పుడు మ‌న దాకా వ‌చ్చాయి. మ‌న గోదావ‌రికి వ‌చ్చాయి. మ‌న తూర్పుగోదావ‌రి జిల్లాలోకి కూడా వ‌చ్చాయి. 

ఇంత‌కు ముందు ఈ చేప‌లు.. అమేజాన్ అడ‌వుల్లోని న‌దుల్లో ఉండేవి. త‌ర్వాత కొన్ని స‌ముద్రాల్లో క‌లిశాయి. మ‌న దేశంలోని గంగా న‌దిలో క‌నిపించాయి ఈ కిల్ల‌ర్ ఫిష్ లు. త‌ర్వాత గంగాన‌దిలో క‌లిసే మ‌హాన‌దిలో.. క‌‌నిపించాయి. వార‌ణాసి ఏరియాలో క‌ల్లోలం సృష్టించాయి. జ‌నాలు భ‌య‌ప‌డ్డారు. చెరువుల్లో క‌లిస్తే చంపేశారు. న‌దుల్లో కూడా చంపేశారు. కానీ.. ఎటు నుంచి వ‌చ్చాయో తెలీదు ఈ స‌క్క‌ర్ మౌత్ క్యాట్ ఫిష్ లు. ఇప్పుడు మ‌న గోదావ‌రిలో ఈదుతున్నాయి. మ‌నం కాస్త జాగ్ర‌త్తగా ఉండాల్సిందే అని హెచ్చ‌రిస్తున్నాయి.

యాక్చువ‌ల్ గా చేప‌ల‌న్నీటిలో ఈ స‌క్క‌ర్ మౌత్ క్యాట్ ఫిష్ లు కాస్త వైల్డ్ గా ఉంటాయట‌. మ‌నుషుల్లో ఉండే క్రిమిన‌ల్స్ ఎలాగో.. చేప‌ల్లో ఇవి అలాంటివి. వీటికి మాంసం కావాలి. అంతే. అది ఏ మాంసం అయినా ఓకే. చేప‌, మొస‌లి, పిల్లి, బ‌ల్లి అనేదేం ఉండ‌దు. వాటికి ఏవి దొరికితే అవి తినేస్తాయి. అయితే.. తోటి  చేప‌ల్ని తిన‌డంలో బాగా స్పీడ్ ఉంటాయంట‌. అవి బ‌తికే ఏరియాలో వేరే చేప‌లు బ‌త‌క‌వ‌ట‌. ఇక అన్నీ ఆ చేప‌లే ఉన్న ఏరియాలో మ‌నుషులు న‌డిచినా వెంట ప‌డ‌తాయ‌ట‌. వాటిని అవి తిన‌లేవు క‌దా. అవ‌త‌ల చేప‌లు కూడా అంతే బ‌లంగా ఉంటాయి కాబ‌ట్టి.. వాటిని అవి గెల‌వ‌లేవు. ఆ టైంలో గానీ.. మ‌నుషులు ఈద‌డం.. ఆ ఏరియాలో న‌డ‌వ‌డం చేస్తే అంతే దొరికిన కాడికి కండ లాగేస్తాయ‌ట‌. గుంపులో ప‌డితే మాత్రం గోవిందా. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle