బర్డ్ ప్లూ వ్యాప్తి.. కర్నాటక సరిహద్దుల్లో అప్రమత్తత
07-01-202107-01-2021 11:33:26 IST
2021-01-07T06:03:26.404Z07-01-2021 2021-01-07T06:03:16.137Z - - 21-01-2021

కరోనా మహమ్మారికి తోడుగా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న బర్డ్ ఫ్లూ పై కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలని కర్నాటక పశు సంరక్షణ శాఖ మంత్రి ప్రభు చవాన్ అధికారులను ఆదేశించారు. మైసూరు, కొడకు, దక్షిణ కన్నడ, చామరాజ్ నగర్ప్రాంతాలతో సహా కేరళ సరిహద్దులకు ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో బర్డ్ ప్లూ నేపథ్యంలో అత్యంత అప్రమత్తతను పాటించాలని కర్నాటక్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సంబంధిత జిల్లాలన్నింటిలో పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు. మంత్రి ఆదేశాలకు స్పందించిన మైసూరూ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి మీడియాతో మాట్లాడుతూ తమ జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కి సంబంధించిన ఎలాంటి రిపోర్టులు రాలేదని చెప్పారు. గత సంవత్సరం మైసూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావ ఫలితంగా వేలాది పక్షులు చనిపోయిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా అప్రమత్తత పాటిస్తోందని ఆమె చెప్పారు. కాగా పక్షులు వలసవచ్చిన ప్రాంతాల్లో వాటి శాంపిల్స్‌ని సేకరించి టెస్టుకోసం పంపాలని తమకు ఆదేశాలు వచ్చాయని రాష్ట్ర పశు సంరక్షణ శాఖ అదికారులు చెప్పారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో వలస పక్షులను ఆకర్షిస్తున్న మైసూరు జూను తాత్కాలికంగా మూసివేయడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. కర్నాటకలో ఇంతవరకు అడవి పక్షులు బర్డ్ ఫ్లూ వ్యాధికి గురైనట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించనప్పటికీ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలను తాము చేపట్టామని అధికారులు తెలిపారు. కేంద్రం విధించిన అన్ని మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నామని చెప్పారు. పొంచి ఉన్న కొత్త ఉపద్రవం.. బర్డ్ ఫ్లూతో వేలాది పక్షుల వధ

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
an hour ago

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021
ఇంకా