ఈ దిక్కుమాలిన తుఫాన్ మళ్లొచ్చి మీద పడింది..!
24-11-202024-11-2020 17:32:05 IST
Updated On 24-11-2020 17:47:12 ISTUpdated On 24-11-20202020-11-24T12:02:05.342Z24-11-2020 2020-11-24T11:52:33.993Z - 2020-11-24T12:17:12.957Z - 24-11-2020

కాస్త ఊపిరి తీసుకునే టైం అయినా ఇవ్వాలి కదా. మొన్నటి దాకా దంచింది. మళ్లీ వెంట పడుతోంది. ఏంటో ఈ తుఫాన్ దరిద్రం ఇలా ఉంది. పాపం రైతులు.. గుండెలు చేతిలో పట్టుకుని బతకాల్సిన టైం వచ్చింది. పంటలు ఇప్పుడే చేతికి వస్తున్నాయి. ఎనకా ముందుగా ఈ నెల రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వర్షాలు కానీ వస్తే.. అంతా చిత్తడి చిత్తడి అవుతుంది. రైతులకి భారీగా నష్టాలు తప్పవు. వర్షం ఒక్కసారి వచ్చిపోతే ఏమో కానీ.. అలాగే ఉంటే మాత్రం కష్టమే. కానీ.. ఇదేంటో ఈ తుఫానేంటో. నివర్ అనే పేరుతో మీదొచ్చి పడుతోంది. మీ మాట వినేదే లేదు.. నెవర్ నెవర్ అంటోంది నివర్ తుఫాన్. మొన్ననే కోలుకోని దెబ్బ తగలడంతో.. ఇప్పుడు కాస్త ముందుగానే అలర్ట్ అయింది సర్కార్. మరో 12 గంటల్లో తుఫాన్ గా.. ఒక్క రోజులు తీవ్ర తుఫాన్ గా మారి జనం పై పడుతుందంట. దాన్ని బేస్ చేసుకుని అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సుల్లో మాట్లాడారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగారు.. ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టమూ జరక్కూడదని ఆర్డర్ చేశారు. బుధ, గురు వారాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతోంది వెదర్ రిపోర్ట్. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఏపీ వైపు పరుగెత్తుకుంటూ వస్తుందంట తుఫాన్. ఎక్కడ తీరం దాటుతుంది అనే క్లియర్ కట్ ఆన్సర్స్ లేకపోయినా.. మనకి మాత్రం తుఫాన్ ఎఫెక్ట్ బానే ఉంటుంది అని చెబుతున్నారు. నేరుగా ఉండకున్నా.. ఎఫెక్ట్ బానే ఉంటుందని చెబుతున్నారు. ఏమో.. దానికి రిమ్మ తిరిగి.. మన తీరం వైపు మళ్లితే వరకు ఏం చేస్తాం.. ఆపగలమా చెప్పండి.

గన్ గురిపెట్టి.. ముత్తూట్ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ
15 hours ago

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
22-01-2021

డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'
22-01-2021

మూడంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు..
21-01-2021

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
21-01-2021

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021
ఇంకా