newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

25-09-202025-09-2020 12:01:17 IST
2020-09-25T06:31:17.258Z25-09-2020 2020-09-25T06:31:11.705Z - - 21-10-2020

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వడంతో పెద్దగా మార్పులు లేకుండా అలా సాగిపోయాయి అంతే..! అయితే లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరికొకరు కనిపించారు. ఆ తర్వాత వారి మధ్య ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. దీంతో ఇప్పుడు వారిరువు ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు. ఈ ఇటాలియన్ జంట లాక్ డౌన్ సమయంలో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. 

ఈ ఇటాలియన్ జంటను రోమియో జూలియట్ ఆఫ్ లాక్ డౌన్ అని అంటున్నారు. అది కూడా రోమియో జూలియట్ కథ చోటు చేసుకున్న నగరమైన 'వెరోనా' లోనే వీరి ప్రేమ కూడా పుట్టడం విశేషం. వీరి జీవితంలో రోమియో-జూలియట్ లాగా విషాద క్లైమాక్స్ లేదనుకోండి.  

38 సంవత్సరాల మిషెల్ డి ఆల్ఫోస్, 40 సంవత్సరాల పావోలా అగ్నెల్లిని తన టెర్రస్ మీద నుండి చూశాడు. అది కూడా మార్చి నెలలో అలా అగ్నెల్లి మీద ఆల్ఫోస్ కు చూడగానే ప్రేమ పుట్టింది. అగ్నెల్లి ఆరో ఫ్లోర్ లో నివసిస్తూ ఉండగా.. ఆల్ఫోస్ ఏడో ఫ్లోర్ లో ఉండేవాడు. 

అలా ఒకరినొకరు చూసుకున్నాక.. వారి మధ్య ప్రేమ పుట్టింది. అగ్నెల్లి సోదరికి ఆల్ఫోస్ పేరు తెలుసునట..! లాక్ డౌన్ కు ముందు వారిద్దరూ కలిసి ఒకే జిమ్ లో వర్కౌట్లు చేసే వారట. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఐడీలు తెలుసుకున్నారు. అర్ధరాత్రిళ్ళు కూడా ఇద్దరూ చాట్ చేస్తూ ఉండేవారు. ఇటలీలో దాదాపు 10 వారాల పాటూ లాక్ డౌన్ ను అమలు చేయడంతో ఒకరినొకరు కలవలేకపోయారు. అయినప్పటికీ వారి మధ్య బాండింగ్ అలాగే నిలిచిపోయింది. ఇద్దరి అభిప్రాయాలు కూడా ఒకటేనని వారికి అర్థమయిపోయింది. అగ్నెల్లి లాయర్ గా విధులు నిర్వర్తిస్తూ ఉండగా.. ఆల్ఫోస్ కమ్యూటర్ల మీద పని చేస్తూ ఉండే వాడు.   

ఇద్దరి మధ్యన దూరం 200 మీటర్లు మాత్రమే.. కానీ కలవలేకపోయారు చాలా కాలం వరకూ..! ఆల్ఫోస్ ఆమె కోసం పూలను పంపిస్తూ ఉండే వాడు. అతడి కోసం ఆమె కూడా తన అపార్ట్మెంట్ బాల్కనీలో ఓ బ్యానర్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయం మీడియా దాకా కూడా చేరడంతో మోడ్రన్ రోమియో-జూలియట్ అంటూ కథనాలు వచ్చాయి. ఇక మే నెలలో వారి మధ్య ఉన్న దూరం తగ్గింది. స్థానికంగా ఉండే పార్క్ లో ఇద్దరూ కలుసుకున్నారు. మాస్కులను తీసేసి.. ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అలా తమ ప్రేమను వ్యక్త పరుచుకున్నారు. జులై నెలలో ఇరు కుటుంబాలు కలుసుకున్నాయి. వీరి ప్రేమను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా కరోనా వైరస్ ప్రేమ కథ కాస్తా సుఖంతమైంది.   


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle