ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-202117-01-2021 14:17:59 IST
2021-01-17T08:47:59.563Z17-01-2021 2021-01-17T08:22:43.208Z - - 07-03-2021

ఇండోనేషియాలోని తూర్పు జావాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావానికి 5.6 కిలోమీటర్ల మేరకు ఆకాశంలోకి బూడిద, పొగలు వ్యాఫించాయి. కాగా ఇంతవరకు ఈ ఘటనలో 42 మంది మరణించారని సమాచారం.
ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం భారీ భూకంపం ధాటికి వణికిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భారీ భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులు సేకరిస్తున్నారు. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా పాక్షికంగా ధ్వంసమైంది.
శిథిలాల్లో చిక్కుకున్న పేషెంట్లు, సిబ్బందిని రక్షించేందుకు ఎన్డీఎంఏ ప్రయత్నిస్తోంది. భూకంప బాధితుల కోసం తాత్కాలిక నివాస, భోజన ఏర్పాట్లు చేశారు. ముముజులోని గవర్నర్ బంగళా కూడా ధ్వంసమైందని, శి«థిలాల్లో పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యంత్ర సామగ్రి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఎంఏ సిబ్బంది తెలిపారు.
జకర్తా, మకస్సర్, పలు తదితర నగరాల నుంచి మాముజుకు సహాయ సిబ్బందిని తరలిస్తున్నామని ఎన్డీఎంఏ చీఫ్ బాగస్ పురుహితొ వెల్లడించారు. సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది.
కాగా సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు.
ఇండోనేషియాలో 140 అగ్నిపర్వతాలు క్రియాశీలంగా ఉంటున్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని యాక్టివ్ అగ్నిపర్వతాలు లేవు. అగ్నిపర్వతం బద్దలుకావడానికి ముందు వారాలు లేక నెలల తరబడి పొగలు చిమ్ముతుంటుంది.

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
9 hours ago

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
10 hours ago

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021

బార్స్ ఇస్తున్నయ్ ఆఫర్స్
03-03-2021

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్
02-03-2021

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
01-03-2021
ఇంకా