newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

27-11-202027-11-2020 17:40:26 IST
2020-11-27T12:10:26.645Z27-11-2020 2020-11-27T12:10:23.466Z - - 21-01-2021

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నివర్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో శనివారం నాడు(నవంబర్ 27) నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. పలు జిల్లాల్లో పరీక్ష నిర్వహించడం కష్టమవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాపడిన ఈ పరీక్షను డిసెంబరు 5న నిర్వహిస్తామని ఆర్జీయూకేటీ కన్వీనర్ డి.హరినారాయణ వెల్లడించారు. ఇప్పటికే జారీ అయిన హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, ఆ హాల్ టికెట్లపైనే, అవే పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యేవారు ఏదైనా గుర్తింపు కార్డుతో 2 గంటలు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు. 

నివర్ తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకొన్ని  గంటల్లో మరింతగా బలహీనపడి  అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని మామళ్లపురం-కరెైకల్‌ మధ్య తీరం దాటిన నివర్‌ తుపాను ఏపీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది.  గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ  వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది.

పిడ‌క‌లు అమ్మ‌డం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్ర‌స్టింగ్

పిడ‌క‌లు అమ్మ‌డం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్ర‌స్టింగ్

   31 minutes ago


మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!

   20-01-2021


అత్త‌కు గుడి కట్టిన కోడళ్ళు.. ప్ర‌తి నెలా భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు

అత్త‌కు గుడి కట్టిన కోడళ్ళు.. ప్ర‌తి నెలా భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు

   20-01-2021


కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!

   18-01-2021


అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..

   17-01-2021


ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి

   17-01-2021


టీకా విక‌టిస్తే మాదే బాధ్య‌త‌.. పైసా పైసా క‌ట్టేస్తాం

టీకా విక‌టిస్తే మాదే బాధ్య‌త‌.. పైసా పైసా క‌ట్టేస్తాం

   17-01-2021


ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..

   16-01-2021


తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే

   16-01-2021


ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెట‌ర్

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెట‌ర్

   15-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle