newssting
Radio
BITING NEWS :
పదవి నుంచి దిగిపోనున్న అమెరికా ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ సలహాదారు రాజీనామా చేశారు. ట్రంప్ సలహాదారు అయిన స్కాట్ అట్లాస్ తన రాజీనామా లేఖను మంగళవారం పంపించారు * కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది * ఆల్‌ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్‌ సీటు కోల్పోయాడు. అక్టోబర్‌ 31న తన రోల్‌నెంబర్‌పై అప్‌డేట్ల కోసం నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా విత్‌ డ్రా ఫ్రం సీట్‌ అలకేషన్‌ అండ్‌ ఫరదర్‌ రౌండ్స్‌ లింక్‌ను తను క్లిక్‌ చేయడంతో సీటు కోల్పోయాడు * ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘బురేవి’ వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతాల్లో మంగళవారం మరో సారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది * దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య తిరిగి వంద దాటింది. కరోనాతో మొత్తం 108 మంది మృతి చెందారు. ఇదే సమయంలో కొత్తగా 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి * కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఆరు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ మూడో దఫా చర్చలు జరగనున్నాయి * శ్రీలంకలోని మహారా జైలులో ఘర్షణలు చోటు చేసుకుని ఎనిమిది మంది ఖైదీలు మృతి. మరో 37 మందికి గాయాలు. వారిలో ఇద్దరు జైలర్లు ఉండగా గాయాలపాలైన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది * సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వెళ్లే శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల ముందే రైల్వేస్టేషన్‌ నుండి బయల్దేరడంతో.. రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు * యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురి చేసేలా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఏర్పాట్లు చేశారు * నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు * నేటితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు. కార్తిక సోమవారం సందర్భంగా ఘాట్లలో నిన్న భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. నేడు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పుష్కరాల ముగింపు వేళ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా * తమిళనాడుకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా.. తర్వాత తుపానుగా మారనుంది. ఇది బుధవారం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది * టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు ఊహించని షాక్‌. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో భారీ జరిమానా. త్రిశూల్‌ సిమెంట ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయం.

త్వ‌ర‌లో గూగుల్ కొత్త పాల‌సీ.. రెండేళ్లు దాటితే డేటా డిలీట్‌..!

16-11-202016-11-2020 19:27:27 IST
2020-11-16T13:57:27.497Z16-11-2020 2020-11-16T13:57:10.996Z - - 01-12-2020

త్వ‌ర‌లో గూగుల్ కొత్త పాల‌సీ.. రెండేళ్లు దాటితే డేటా డిలీట్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వినియోగ‌దారుల సౌల‌భ్యం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను మార్చుకుంటుంది గూగుల్‌. వినియోగ‌దారుల సౌక‌ర్య‌మే త‌మ‌కు అత్యంత కీల‌కం అని ప‌లు సంద‌ర్భాల్లో గూగుల్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వినియోగ‌దారుల ఖాతాలో జీ మెయిల్‌, గూగుల్ డ్రైవ్‌లోని క్రియా ర‌హితంగా, ప‌రిమితికి మించి ఉన్న వాటి కోసం గూగుల్ స‌రికొత్త పాల‌సీ తీసుకురానుంది. దీనిలో భాగంగా వ‌చ్చే ఏడాది  జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్న గూగుల్‌ కొత్త పాలసీతో డాక్స్‌, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్‌లు, జూమ్‌బోర్డు ఫైల్స్‌, ఫొటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్‌ తెలిపింది.

వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ తొలగించనుంది. అదేవిధంగా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్‌, డ్రైవ్‌, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. మేమేదైనా కంటెంట్‌ తొలగించడానికి ముందు మీకు చాలా సార్లు సమాచారం ఇస్తామని తెలిపింది. అందువ‌ల్ల ఖాతాను చురుగ్గా ఉంచ‌డానికి మీరు ఎప్ప‌టిక‌ప్పుడు జీమెయిల్‌, డ్రైవ్ ఫోటోల‌ను చూస్తూ ఉండాల‌ని సూచించింది. సైన్‌ ఇన్‌ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్‌ కనెక్ట్‌ చేశారని గూగుల్‌ ఒక రికార్డు చేసుకుంటుందని తెలిపింది. ఇనాక్టివ్‌ అకౌంట్‌ మేనేజర్‌ నిర్ధిష్ట కంటెంట్‌ను నిర్వహించడానికి  మీకు సహయ పడుతుందని పేర్కొంది.

డ్రగ్స్ వాడకంలో ఎవరికీ తీసిపోని భారత్..

డ్రగ్స్ వాడకంలో ఎవరికీ తీసిపోని భారత్..

   30-11-2020


టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

   29-11-2020


నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

   28-11-2020


ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

   27-11-2020


శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

   27-11-2020


నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

   27-11-2020


పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

   27-11-2020


ఏపీని వణికిస్తున్న నివర్..!

ఏపీని వణికిస్తున్న నివర్..!

   27-11-2020


సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

   25-11-2020


చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

   25-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle