newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్

23-02-202123-02-2021 12:27:39 IST
Updated On 23-02-2021 15:34:52 ISTUpdated On 23-02-20212021-02-23T06:57:39.947Z23-02-2021 2021-02-23T06:57:36.866Z - 2021-02-23T10:04:52.168Z - 23-02-2021

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ లో దంత విద్యార్థిని మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కర్ణాటకలోని గుల్బర్గలో కడపకు చెందిన రేష్మ (20) దంత కళాశాలలో చదువుతోంది. కుటుంబసభ్యులు కాశీ యాత్రకు వెళుతుండటంతో కడపకు బయలుదేరింది. మధ్యలో కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట కాలనీలోని ఉమెన్స్‌ హాస్టల్స్‌లో ఉన్న శ్రీజను కలవడానికి శుక్రవారం వచ్చింది. శనివారం రాత్రి శ్రీజ, మమత, అజయ్‌సింగ్, శ్రావణ్‌కుమార్‌లతో కలిసి మదీనాగూడలో ఉన్న జీఎస్‌ఎం మాల్‌లో సినిమా చూడటానికి వెళ్లింది. రాత్రి సినిమా ముగిసిన తరువాత రేష్మ స్కూటీపై కేపీహెచ్‌బీ కాలనీకి వస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీకి వస్తుండగా మధ్యలో మెట్రో పిల్లర్‌ 660, 661 వద్ద పక్క నుంచి ఇంకో వాహనం వేగంగా వెళ్లింది. రేష్మా అదుపు తప్పి కిందపడిపోయింది. వెనకే వస్తున్న లారీ ముందు టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ కృష్ణ అక్కడే లారీని వదిలేసి పారిపోయాడు.  

ఇక స్కూటీ ఇచ్చినందుకు అజయ్‌కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైక్ ఇవ్వకూడదు.. అలా ఇచ్చిందుకే ఇప్పుడు అజయ్ కుమార్ పై కేసు నమోదు అయ్యింది. ఇతరుల వాహనం నడిపే క్రమంలో లైసెన్స్‌ లేని వ్యక్తి ప్రమాదం బారిన పడితే వాహనం యజమాని జైలుకు వెళ్ళాడు. స్నేహితురాలికి తన స్కూటీ ఇస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్కూటీ యజమాని అయిన స్నేహితుడిని ప్రధాన నిందితుడిగా చేస్తూ, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. రేష్మా మరణించిన కేసులో స్కూటీ యజమాని అజయ్‌సింగ్‌ (23), హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇచ్చి, వారు ఏదైనా ప్రమాదానికి గురైతే, వాహనం యజమానిదే బాధ్యతని పోలీసులు ఎంతగా చెప్పినా వినని వారికి ఇది ఓ గుణపాఠమని అంటున్నారు. స్నేహితురాలే కదా అని అతను వాహనాన్ని ఇచ్చాడని, ఆ వాహనం లారీని ఢీకొనగా రేష్మ దుర్మరణం పాలైందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిబంధనల ప్రకారం, అజయ్ సింగ్ ను ఏ1గా, లారీ డ్రైవర్ ను ఏ2గా పేర్కొన్నామని, అజయ్ సింగ్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

   10 hours ago


హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

   13 hours ago


బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

   03-03-2021


బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

   02-03-2021


కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

   01-03-2021


సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

   28-02-2021


తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

   28-02-2021


మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

   27-02-2021


గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

   25-02-2021


అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

   25-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle