newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

హైద‌రాబాద్ లో భేషుగ్గా వెళ్లాలంటే ఒక్కటే దారి

14-10-202014-10-2020 19:26:52 IST
2020-10-14T13:56:52.608Z14-10-2020 2020-10-14T13:55:26.502Z - - 21-10-2020

హైద‌రాబాద్ లో భేషుగ్గా వెళ్లాలంటే ఒక్కటే దారి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాన‌లు వాన‌లు వాన‌లు. వారం నుంచి వాన‌లే. ప‌ది రోజుల నుంచీ వాన‌లే. ఆఫీసుల‌కి పొయ్యేట‌ప్పుడు వ‌చ్చేట‌ప్పుడు నానా తిప్ప‌లు ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. ట్రాఫిక్ లో క‌ష్టాలు.. మ్యాన్ హోల్ భ‌యాలు. కార్లైతే కొంత‌లో కొంత న‌య‌మే గానీ.. బండ్ల‌పై వెళ్లే వారికి మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇక రెండు రోజులుగా చూస్తున్నాం క‌దా. వ‌ర‌ద‌లొచ్చి కొట్టుకుపోతున్న‌య్ బండ్లు. కార్లు కూడా కాగిత‌పు ప‌డ‌వ‌ల్లా లేచి పోతున్న‌య్. అందుకే.. అందరూ మెట్రో మెట్రో అంటున్నారు.

ఈ దిక్కు మాలిన క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత‌.. మెట్రో అంటే భ‌య‌ప‌డుతున్నారు జ‌నాలు. బస్సులు కూడా భ‌య‌మే. ఏసీ ఉండ‌డంతో మెట్రో అంటే టెన్ష‌న్ గా ఉన్నారు. ఎక్కేవాళ్ల సంఖ్య భారీగా త‌గ్గింది కూడా. కానీ.. ఈ వాన‌ల టైంలో మాత్రం మెట్రోనే బెట‌ర్. ఎంత వ‌ర‌దొచ్చినా దానికి ఏమీ కాదు. మ‌రీ ప‌ట్టాలు క‌న‌ప‌డ‌నంత వానైతేనే త‌ప్ప‌.. ఏగోలా ఉండ‌దు. మెట్రో స్టేష‌న్ లో వెయిట్ చేయాల‌న్నా కూడా ప్ర‌శాంతం. బ‌స్టాపుల్లో వెయిట్ చేయాల‌న్నా ప్లేస్ ఉండ‌దు. ఇద్ద‌రు ముగ్గురు త‌ప్ప‌.. ఎక్కువ‌మంది నుంచోడం వీలు కాదు. వాళ్లు కూడా వానొస్తే త‌డ‌వాల్సిందే. వేరే దిక్కు లేదు.

అందుకే రోడ్ల‌పై వెళ్లే వాళ్లు కూడా మెట్రో స్టేష‌న్ ల కింద వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే మెట్రోకి డిమాండ్ వ‌చ్చింది. ఆఫీస్ కి రావాల్సిందే, డ్యూటీకి రావాల్సిందే అని పీక‌మీద క‌త్తి పెట్టి పిలిచే బాస్ లు ఉంటారు క‌దా. వాళ్లకి స‌బార్డినేట్ లు గా ప‌నిచేసే వారికి ఒక్క‌టే దిక్కు మెట్రో. ఇంటి ద‌గ్గ‌ర్నుంచి ఎలాగోలా క‌ష్ట‌పడి మెట్రో ద‌గ్గ‌రికి వ‌స్తే.. మెట్రోలో ఎక్కి ఆఫీస్ కి ద‌గ్గ‌ర దాకా ప్ర‌శాంతంగా వెళ్లొచ్చు. అక్క‌డి నుంచి న‌డిచో, ఉరుక్కుంట‌నో ఆఫీస్ కి వెళ్లొచ్చు అని ఆలోచిస్తున్నారు. మెయిన్ గా బండ్ల‌పై వెళ్లే వాళ్ల‌కి మాత్రం మెట్రో బెస్ట్ ఆప్ష‌న్.

ఇంటి ద‌గ్గ‌ర‌ బండి మ‌ధ్య‌లో మెట్రో.. ఆఫీస్ ద‌గ్గ‌ర దిగిన త‌ర్వాత మ‌ళ్లీ ఆటో అంటే మామూలు వాళ్ల‌కి క‌ష్ట‌మే. జీతం కాస్త బెట‌ర్ గా ఉండి.. ఈఎమ్ఐలు త‌క్కువ‌గా ఉన్న‌వారికి మాత్రం మంచి ఆప్ష‌న్.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle