newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

మెకానిక్ షెడ్డుల‌కు గిరాకీ

18-10-202018-10-2020 12:02:25 IST
Updated On 18-10-2020 12:21:00 ISTUpdated On 18-10-20202020-10-18T06:32:25.902Z18-10-2020 2020-10-18T06:32:15.492Z - 2020-10-18T06:51:00.078Z - 18-10-2020

మెకానిక్ షెడ్డుల‌కు గిరాకీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టైం అంతే. ఎప్పుడు ఎవ‌రి సైడ్ ముల్లు తిరుగుతుందో తెలీదు. ఇప్పుడు మెకానిక్ షెడ్డులే బంగారం అయ్యాయి. జ‌నాలంతా మెకానిక్ అన్నా, మెకానిక్ అన్నా అంటూ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారు హైద‌రాబాద్ లో. అంతేగా మరి. వ‌రుణ దేవుడు మామూలు ఆట‌లు ఆడుతున్నాడా. హైద‌రాబాద్ మీద ప‌గ‌బ‌ట్టి.. తిప్పిచ్చి మ‌ళ్లిచ్చి దంచుతుండె. ఇక మెకానిక్ ల‌కు గిరాకీ రాక ఏముంటుంది చెప్పండి. షోరూమ్ లు గీరూమ్ లు జాన్ తా నై. సందులో ఏ మెకానిక్ షెడ్డున్నా అక్క‌డ బండ్లు క్యూ క‌డుతున్న‌య్. ఇక స‌ర్వీసింగ్ సెంట‌ర్ ల‌కు అయితే ఫుల్లు డిమాండ్. 

వానొస్తే స‌రే గానీ.. వ‌ర‌దొచ్చే స‌రికి.. బుర‌ద బుర‌ద అయ్యాయి క‌దా బండ్లు. ఇక కార్లైతే.. లోప‌ల కూడా మ‌ట్టితో క‌ప్పెట్టింది. ఆగిన కార్ల‌లోకి ఫుల్లు నీళ్లు వెళ్తే.. మ‌ట్టితో క‌ప్పెట్ట‌క ఏముంది చెప్పండి. అంతా చెత్త చెత్త. అద్దాలు వేసుకున్నా సందుల్లోంచి వెళ్తుండె. ఇంజ‌న్ లు గింజ‌న్ లు అంతా బుర‌ద బుర‌ద‌. ఈ ఎమ్ ఐ లు గ‌ట్రా పె‌ట్టి.. ఒ‌క్క కారు కొన‌డ‌మే జీవిత కాల ధ్యేయంగా పెట్టుకుని బ‌తికే వాళ్లు ఎంత‌మంది చెప్పండి. అలా తినో తిన‌కో సంపాదించుకుని.. ఈఎమ్ఐలు క‌ట్టుకుని కార్ కొనుక్కుంటే.. వాన దేవుడేమో.. మొత్తాన్ని మడ‌తెట్టేశాడు. ఇక ఇంజిన్ లోకి నీళ్లు పొయ్యి.. మ‌ట్టి పేరుకు పోయి ఎన్ని బండ్లు బ్రేక్ డాన్స్ వేస్తున్నాయో. అందుకే.. సిటీ‌లో ఇప్పుడు మెకానిక్ ల‌కు ఫుల్ డిమాండ్ వ‌చ్చింది. వాట‌ర్ స‌ర్వీసింగ్ కి అయితే తీరికే ఉండ‌డం లేదంటే న‌మ్మండి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle