newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

కుప్పం వద్ద పంట పొలాల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్

18-10-202018-10-2020 16:02:39 IST
2020-10-18T10:32:39.221Z18-10-2020 2020-10-18T10:32:13.777Z - - 21-10-2020

కుప్పం వద్ద పంట పొలాల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చిత్తూరు జిల్లా కుప్పం.. అటు తమిళనాడు, ఇటు కర్ణాటకకు బోర్డర్ అన్న సంగతి తెలిసిందే..! తాజాగా కుప్పం దగ్గర హెలికాప్టర్ దిగిందన్న వార్త వైరల్ అవుతోంది. వాట్సప్ లో కూడా కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. పంటపొలాల్లో విమానం దిగడాన్ని స్థానికులు కెమెరాల్లో రికార్డు చేశారు.    

కుప్పం సమీపంలో తమిళనాడు భూభాగంలోని ప్రముఖ ఎస్వీఎన్ జ్యుయెలరీ సంస్థల అధినేత శ్రీనివాసన్ కుటుంబం ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయింది. శ్రీనివాసన్ కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కోయంబత్తూరు నుంచి హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆ హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లు, శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. హెలికాప్టర్ ఆంధ్రా, తమిళనాడు బోర్డర్ వద్దకు రాగానే ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. కుప్పంకు దగ్గరగా ఉన్న  తిరుపత్తూరు జిల్లా గగనతలంలో ఉన్నట్టుండి పొగమంచు కమ్మేయడంతో హెలికాప్టర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు పైలెట్లు విఫలయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపత్తూరు జిల్లా నంగిలి వద్ద పొలాల్లో  దింపేశారు. హెలికాప్టర్ సురక్షితంగా కిందికి దిగడంతో ప్రమాదం తప్పింది.  వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి తిరుపతి దిశగా పయనమైంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle