హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు
25-11-202025-11-2020 14:08:29 IST
Updated On 25-11-2020 14:46:21 ISTUpdated On 25-11-20202020-11-25T08:38:29.617Z25-11-2020 2020-11-25T08:38:25.877Z - 2020-11-25T09:16:21.506Z - 25-11-2020

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. నివారు తుపాను తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. నివర్ ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు. 7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. ఈ అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతవరణశాఖ అధికారులు తెలిపారు. నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. నేటి నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. గురు, శుక్ర వారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని, నివర్ తుపాను తీరాన్ని దాటిన తరువాత ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణితో కలిసి తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఐఎండీ నుంచి వచ్చిన సూచనలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లు అలర్ట్ అయ్యాయి. నివర్ తుపాను తమిళనాడు తీరాన్ని దాటుతూ, ఆపై రాయలసీమ, కర్ణాటకల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలిపింది భారత వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరంజ్ ఎలర్ట్ ను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాల్లో 26వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయి.. తెలంగాణ దక్షిణ, వాయవ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, ఈ విషయంలో పూర్తి అంచనాకు రావాలంటే, గురువారం నాడు తుపాను గమనాన్ని పరిశీలించాల్సి వుంటుందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
a day ago

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021

తెలంగాణ ప్రజలకు కంటి మీద కునుకే లేదు
15-01-2021
ఇంకా