newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

కోతి వేషాలేస్తే జైలుకే

17-10-202017-10-2020 10:50:30 IST
Updated On 17-10-2020 11:18:42 ISTUpdated On 17-10-20202020-10-17T05:20:30.462Z17-10-2020 2020-10-17T05:20:12.765Z - 2020-10-17T05:48:42.962Z - 17-10-2020

కోతి వేషాలేస్తే జైలుకే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ దిక్కుమాలిన సోష‌ల్ మీడియా పాపులారిటీ కోసం ఎన్ని సెక‌లు ప‌డుతుంటారో జ‌నాలు. టీనేజ్ పోర‌గాళ్ల‌నైతే ఆప‌లేం. సోష‌ల్ మీడియాలో వెయ్యికి మించి ఫాలో వ‌ర్లు.. ఐదారొంద‌ల లైక్ ల‌కు మించి వ‌స్తుంటే చాలు. ఆగ‌నే ఆగ‌రు. ఇక మిలియ‌న్స్ లో ఫాలోవ‌ర్లు.. ల‌క్ష‌ల్లో రెస్పాన్సులు ఉంటే.. జీవితాన్ని ఫ‌ణంగా పెట్టేస్తారు. మొన్న‌టి దాకా టిక్ టాక్ ఇట్టాగే కిచిడీ ఎవ్వారాలు చేసింది. జ‌నాలు త‌ట్టుకోలేక తిట్టుకున్నారు. ఇప్పుడు ఇన్ స్టా గ్ర‌మ్ ఒక్క‌టే ఇలాంటి వాటికి అడ్డా అయింది. అక్క‌డ ఫాలోవ‌ర్లు రావ‌డం అంటే ఆషామాషీ కాదు. స్టార్ల‌కి కూడా ల‌క్ష‌ల్లోనే ఉంటారు. అందుకే.. ఇన్ స్టా ఫాలోవ‌ర్ల కోసం కోతి వేషాలేసే వాళ్లు ఫుల్లుగా పెరిగారు. ముంబైలో కూడా ఇలాంటి వేషాలేస్తూ ఇన్ స్టా లో పెడుతూ.. ఫాలోవ‌ర్ల‌ని తెచ్చుకుందాం అనుకున్న ఓ యంగ్ స్ట‌ర్ కి పోలీసులు చుక్క‌లు చూపించారు.

22 అంత‌స్థుల బిల్డింగ్ పై హ్యాండ్ స్టాండ్ వేశాడు ఈ కుర్రాడు. ప‌క్క‌నే ఉన్న ఇద్ద‌రు ఫ్రెండ్స్ దాన్ని వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. సూప‌ర్ వ‌చ్చింది.. సూప‌ర్ వ‌చ్చింది అని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఇన్ స్టాలో పెట్టారు. అలా పెట్టాడో లేదో ఇలో పాపుల‌ర్ అయిపోయింది. చూసిన ప్ర‌తి వాడూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టాడ‌ట‌. 22 అంత‌స్థుల బిల్డింగ్ ఎడ్జ్ లోకి వెళ్లి ఇలాంటి వేషాలేస్తే.. ఉందామ‌నా పోదామ‌నా మీ సెక‌లు అని ఏసుకున్నార‌ట ఆ పోర‌గాడిని. తిట్టించుకుంటూ వైర‌ల్ అయిపోతున్నా అని ఎంజాయ్ చేశాడ‌ట‌. కానీ.. పోలీసులు ఎంట‌రైతే ఎలా ఉంటుందో తెలుసు క‌దా. ఏ కేసు పెట్టారో తెలీదు కానీ.. ముందైతే లోప‌లేశారు. 

నిజ‌మే ఇలాంటిది చేస్తేనే మంచిది. ఆ పిల్లోడికేం తెలుసు. తెలిసీ తెలీని వ‌య‌సులో అలాంటి ఆట‌లాడితే.. 22 అంత‌స్థుల బిల్డింగ్ పై నుంచి కింద ప‌డితే.. నేల‌కి అతుక్కుపోవ‌డ‌మే. ఒక్క ఎముక కూడా ఉండ‌దు. అన్నీ పుటుక్కుమంట‌య్. అందుకే పోలీసులు లోప‌లేసి మంచి ప‌ని చేశారు. ఇది వైర‌ల్ అయింద‌ని ఇంకోటి చేయ‌కుండా..ఇంకొక‌డు చేయ‌కుండా ఆపారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle