newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

25-11-202125-11-2021 14:31:06 IST
2021-11-25T09:01:06.510Z25-11-2021 2021-11-25T09:01:03.860Z - - 08-08-2022

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కన్న తండ్రే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కూతురిపై కన్నేశాడు, భయపెట్టి, బెదిరించి తన కూతురుతో తన కోరికలు తీర్చుకున్నాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు. చివరికి ఆ చిన్నారి గర్భం దాల్చడంతో ఈ అమానుష ఘటన బయటపడింది. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. అనంతనపురం జిల్లా గుంతకల్లులో పెయింటర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి పెళ్లి జరిగి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. మధ్యానికి బానిసైన తండ్రి మత్తులో తన 15 ఏళ్ల పెద్ద కూతురిపై అత్యాచారం చేయసాగాడు. 

కూతురు అనారోగ్యం పాలు కావడంతో తల్లి ఆసుపత్రికి తీసుకుపోవడంతో అసలు నిజం బయటపడింది. ఆ తల్లి కూతురిని గట్టిగా అడగటంతో తన తండ్రి చేసిన పాడు పని చెప్పి బోరున ఏడ్చింది ఆ కూతురు. ఆ తల్లి నిజం బయటికి తెలిస్తే పరువు పోతుందనే భయంతో తన కూతురికి అబార్షన్ చేయమని వైద్యులను కోరడంతో వారు నిరాకరించారు, పోలీసులకు తెలుపుతామని చెప్పడంతో బయపడి ఆ తల్లీ కూతుర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

వారు అక్కడితో ఆగకుండా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కూడా ఆ బాలికకు పరీక్షలు చేస్తే గర్భవతి అని తేలడంతో అబార్షన్ చేయాలని ఆ తల్లి పట్టుపట్టడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle