newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ఫాస్టాగ్ లేదంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు

16-11-202016-11-2020 07:48:45 IST
Updated On 16-11-2020 07:54:16 ISTUpdated On 16-11-20202020-11-16T02:18:45.820Z16-11-2020 2020-11-16T02:18:37.087Z - 2020-11-16T02:24:16.536Z - 16-11-2020

ఫాస్టాగ్ లేదంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫాస్టాగ్ ను తప్పనిసరి చేయాలని కేంద్రప్రభుత్వం ఎప్పటి నుండో యోచిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఎన్నో మార్పులను కేంద్రప్రభుత్వం రవాణా శాఖలో తీసుకుని వచ్చింది. అందుకు తగ్గట్టుగా రాష్ట్రప్రభుత్వాలకు కూడా పలు సూచనలు చేస్తోంది. భారీ, చిన్నతరహా వాహనాలకు వచ్చే జనవరి 1నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1నుంచి వాహనానికి ఫాస్టాగ్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.

కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్‌ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 ఏప్రిల్‌ 1 నుంచి థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది.

ఫాస్టాగ్‌ లేకపోతే వాహనానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు అందాయి. 2019 డిసెంబర్‌ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా వీలుపడలేదు. ఆ కోవిడ్‌ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో  వాహనాలకు ఫాస్టాగ్ ఉంచుకోవడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకుని వస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్‌ పద్దతిలో టోల్‌ ఫీజు చెల్లింపును మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి పాత వాహనాలతోపాటు అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాల యజమానులు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ ఫీజు చెల్లించాలని సూచించింది. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీహెచ్‌) కొద్దిరోజుల కిందట నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

   15 hours ago


నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

   28-11-2020


ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

   27-11-2020


శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

   27-11-2020


నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

   27-11-2020


పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

   27-11-2020


ఏపీని వణికిస్తున్న నివర్..!

ఏపీని వణికిస్తున్న నివర్..!

   27-11-2020


సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

   25-11-2020


చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

   25-11-2020


హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

   25-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle