newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

ప్ర‌తి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం

23-02-202123-02-2021 18:02:17 IST
Updated On 23-02-2021 10:02:18 ISTUpdated On 23-02-20212021-02-23T12:32:17.769Z23-02-2021 2021-02-23T03:02:57.500Z - 2021-02-23T04:32:18.399Z - 23-02-2021

ప్ర‌తి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇది కాస్త ఇంట్ర‌స్టింగే. కానీ.. అనుభ‌వించే కుర్రాడికి మాత్రం.. చాలా ఇబ్బంది గా మారింది. మామూలుగా అమెరికా లో ఈ సెంటిమెంట్స్ కాస్త త‌క్కువ‌. వావి వ‌ర‌స‌లు ఎవ్వారంలో పెద్ద‌గా ప‌ట్టింపులు ఉండ‌వు. కానీ.. ఓ కుర్రాడు మాత్రం.. మ‌న‌కంటే ఎక్కువ మేన్ టేన్ చేస్తున్నాడు. అత‌ని ఎమోష‌న్స్ తో ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నాడు. ముఖ్యంగా.. డేటింగ్ కి దూరంగా ఉండాల్సిన సిచ్చువేష‌న్స్ లో ప‌డిపోయాడు. టీనేజ్ లోనే డేటింగ్ ల‌తో బిజీగా ఉంటారు క‌దా వాళ్లు.. ఈ కుర్రాడేమో.. 24 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చినా.. డేటింగ్ అంటే టెన్ష‌న్ ప‌డుతున్నాడు. ఎందుకంటే.. త‌ను క‌లిసే ప్ర‌తి అమ్మాయి త‌న చెల్లెలేనేమో అని ఫీల‌వుతున్నాడు. 

ఏం ఎందుక‌లా అంటే.. అమెరికాలోని ఓరెగాన్ లో త‌న తండ్రి.. పెద్ద వీర్య‌దాత. బాగా ఫేమ‌స్. అతను వీర్య ‌దానం చేస్తే.. మిస్ అవ‌కుండా పిల్ల‌లు పుడ‌తారు అనే టాక్ ఉంది. అలాగే జ‌రిగింది కూడా. అక్క‌డి జ‌నాలు కూడా పెద్ద‌గా పట్టించుకోరు కాబ‌ట్టి.. వీర్య దానం బానే తీసుకున్నారు. ఓ 5 వంద‌ల మందికి వీర్య‌దానం చేశాడ‌ట‌. వాళ్ల‌కి పిల్లలు కూడా పుట్టార‌ట‌. తాను ఎంత ఫేమ‌స్ అయినా.. మ‌రీ దూరం నుంచైతే రాలేద‌ట‌. చుట్టు ప‌క్క‌ల ఏరియాల వాళ్లే ఎక్కువ మంది అప్రోచ్ అయ్యార‌ట‌.

కానీ.. ఇప్పుడు అత‌ను చేసిన వీర్య‌దానంతో కొడుక్కి తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఎందుకంటే.. త‌ను డేటింగ్ చేయ‌డానికి రెడీ అవుతున్న అమ్మాయిలు త‌న చెల్లెల్లు ఏమో.. త‌న తండ్రి వీర్యానికి పుట్టిన వాళ్లేనేమో అని ఫీల్ అవుతున్నాడ‌ట‌. ఇది మ‌రీ కామెడీ కాక‌పోతే.. అంత టెన్ష‌న్ ఎందుకు అనిపించొచ్చు.

కానీ.. ఇప్ప‌టికే ఇద్ద‌రు గ‌ర్ల్ ఫ్రెండ్స్ విష‌యంలో ఇదే జరిగిందంట‌. డీప్ గా ల‌వ్ లో ఉన్నాక‌.. ఆమె త‌న చెల్లి అని తెలియ‌డం.. త‌న తండ్రి వీర్య‌దానం చేయ‌డం వ‌ల్ల‌నే ఆమె పుట్టింద‌ని తెలియ‌డం.. గుండెను బండ‌ను చేసుకుని దూరం చేసుకోవ‌డం.. డార్లింగ్ అన్న అమ్మాయి కాస్తా.. బ్రో అన‌డంతో.. గుండె ప‌గిలి వ‌క్క‌లైందంట‌. ఇద్ద‌రు అమ్మాయిల విష‌యంలో ఇదే జ‌ర‌గ‌డంతో.. ఇప్పుడు ఆ పిల్లాడికి పిల్ల క‌రువైందంట‌. ప్లాన్లేసి క‌ష్ట‌ప‌డి ఇంప్రెస్ చేసి.. త‌ర్వాత అన్న‌య్యా అని పిలిపించుకోవ‌డం ఎందుకులే అని.. ఒంట‌రిగా ఉంటున్నాడ‌ట‌.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

   25-02-2021


అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

   25-02-2021


Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మహత్య

Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మహత్య

   24-02-2021


రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్

   23-02-2021


మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌కి ఐదునెల‌ల గ‌ర్భం

మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌కి ఐదునెల‌ల గ‌ర్భం

   23-02-2021


కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ

కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ

   22-02-2021


గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..

గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..

   20-02-2021


ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్రాబ్ల‌మా.. ఈ నెంబ‌ర్ కి కాల్ కొట్టండి- సీపీ స‌జ్జ‌నార్

ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్రాబ్ల‌మా.. ఈ నెంబ‌ర్ కి కాల్ కొట్టండి- సీపీ స‌జ్జ‌నార్

   20-02-2021


ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా

   19-02-2021


చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.. అనుమానాస్పదంగా మృతి చెందిన కుమార్తె

చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.. అనుమానాస్పదంగా మృతి చెందిన కుమార్తె

   19-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle